Mahesh Babu : మహేష్ బర్త్ డే రోజు రాజమౌళి సినిమా లాంచ్.. ఆమిర్ ఖాన్ నటిస్తున్నాడా..?

మహేష్ బాబు, రాజమౌళి సినిమా ఓపెనింగ్ కి డేట్ ఫిక్స్ అయ్యిందట. ఇక ఈ సినిమాలో విలన్ గా ఆమిర్ ఖాన్ నటించబోతున్నాడని గత కొన్నిరోజులుగా టాలీవుడ్ టు బాలీవుడ్ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

Mahesh Babu Rajamouli movie SSMB29 opening and Aamir Khan villain details

Mahesh Babu – Rajamouli : RRR సక్సెస్ తరువాత టాలీవుడ్ లోనే కాదు ఇంటర్నేషనల్ వైడ్ రాజమౌళి తదుపరి సినిమా పై ఎంతో ఆసక్తి నెలకుంది. ఇక జక్కన్న నెక్స్ట్ ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉండబోతుందని ఇప్పటికే తెలియజేసిన సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ తో మూవీ పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. దీంతో మూవీ పై రోజుకో వార్త నెట్టింట హల్ చల్ చేస్తుంది. తాజాగా ఈ సినిమా ఓపెనింగ్ డేట్ అండ్ విలన్ రోల్ గురించి ఆసక్తికర న్యూస్ వైరల్ అవుతున్నాయి.

Sapthagiri : సైకిల్ ఎక్కనున్న సినీ నటుడు సప్తగిరి.. చిత్తూరు జిల్లా నుంచి పోటీకి సిద్ధం..

ఈ మూవీ పూజా కార్యక్రమాలు మహేష్ బర్త్ డే రోజు జరగనున్నాయి అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆగష్టు 9న మహేష్ పుట్టినరోజున సినిమాని అధికారికంగా లాంచ్ చేసి.. వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నారని తెలుస్తుంది. మరి ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఇక ఈ మూవీలో విలన్ పాత్రలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ (Aamir Khan) నటించబోతున్నాడని గత కొన్నిరోజులుగా టాలీవుడ్ టు బాలీవుడ్ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

Vijay Deverakonda : విజయ్ వల్ల పూజా హెగ్డేకి మూవీ మిస్.. మరో ఆఫర్‌తో అందుకునే ప్రయత్నం..

అయితే ప్రస్తుతం ఈ మూవీ ఇంకా స్క్రిప్ట్ వర్క్ దశలోనే ఉందట. స్క్రిప్ట్ మొత్తం కంప్లీట్ అయ్యిన తరువాతే చిత్ర యూనిట్.. ఆయా పాత్రలకు నటీనటులు ఎంపిక చేయనుందని SSMB29 టీం సన్నిహిత వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమాలో ఆమిర్ విలన్ చేయబోతున్నాడు అన్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. కాగా మహేష్ ప్రస్తుతం గుంటూరు కారం (Guntur Karam) సినిమాలో నటిస్తున్నాడు. త్రివిక్రమ్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. పూజా హెగ్డే (Pooja Hegde), శ్రీలీల (Sreeleela) హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు