Manoj Tiwary : తూచ్‌.. రిటైర్‌మెంట్ కావ‌ట్లే.. వెన‌క్కి త‌గ్గిన మ‌నోజ్‌ తివారి..!

టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్, బెంగాల్ క్రీడా మంత్రి మనోజ్‌ తివారి(Manoj Tiwary) త‌న రిటైర్‌మెంట్ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకున్నాడు. తిరిగి క్రికెట్ ఆడ‌నున్నాడు.

Manoj Tiwary

Manoj Tiwary reverses retirement call : టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్, బెంగాల్ క్రీడా మంత్రి మనోజ్‌ తివారి(Manoj Tiwary) త‌న రిటైర్‌మెంట్ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకున్నాడు. తిరిగి క్రికెట్ ఆడ‌నున్నాడు. బెంగాల్‌ క్రికెట్‌ ఆసోషియేషన్‌ చైర్మెన్‌ స్నేహసిస్ గంగూలీతో చ‌ర్చించిన త‌రువాత మ‌నోజ్ త‌న రిటైర్‌మెంట్ నిర్ణ‌యాన్ని మార్చుకున్నాడు. నేడు(మంగ‌ళ‌వారం) త‌న నిర్ణ‌యాన్ని మీడియా స‌మావేశంలో అధికారికంగా వెల్ల‌డించే అవ‌కాశం ఉంది.

IND vs WI T20 Match: కుర్రాళ్లు ఏం చేస్తారో..! మూడో టీ20 మ్యాచ్‌లో ఆ ఇద్దరు ఔట్.. యువ సంచలనం ఎంట్రీ ..

మనోజ్‌ తివారీ గత గురువారం (ఆగస్టు3)న రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాడు. అయితే క్యాబ్ అధ్య‌క్షుడు స్నేహ‌సిస్ మాత్రం తివారీ త‌న నిర్ణ‌యాన్ని మార్చుకోవాల‌ని అభ్య‌ర్థించిన‌ట్లు తెలుస్తోంది. ఎందుకంటే గ‌త ఏడాది మ‌నోజ్ సార‌థ్యంలో బెంగాల్ జ‌ట్టు రంజీ ట్రోఫీలో ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది. మ‌నోజ్ జ‌ట్టును వీడితే మిడిల్ ఆర్డ‌ర్ చాలా బ‌ల‌హీనంగా మారుతుంది. ఈ నేప‌థ్యంలో మ‌రికొన్ని రోజులు అత‌డిని జ‌ట్టులో కొన‌సాగాల‌ని స్నేహ‌సిస్ కోరిన‌ట్లు తెలుస్తోంది. CAB వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం అత‌డు క్రికెట్ మైదానంలో తిరిగి అడుగుపెట్ట‌నున్నాడు.

Babar Azam : టీ20ల్లో బాబ‌ర్ ఆజామ్ అరుదైన రికార్డు.. అత్య‌ధిక శ‌త‌కాలు బాదిన ఆట‌గాళ్ల జాబితాలో రెండ‌వ స్థానం

మనోజ్ తివారీ టీమ్ఇండియా త‌రుపున‌ 12 వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వ‌న్డేల్లో ఓ శ‌త‌కం, ఒక అర్థ‌శ‌త‌కం సాయంతో 287 ప‌రుగులు చేశాడు. బౌలింగ్‌లో 5 వికెట్లు ప‌డ‌గొట్టాడు. టీ20ల్లో 15 ప‌రుగులు చేశాడు. ఇక ఐపీఎల్‌లో 98 మ్యాచులు ఆడి 1,695 ప‌రుగులు చేశాడు. కాగా.. దేశ‌వాళీ క్రికెట్‌లో అత‌డికి అద్భుత‌మైన రికార్డే ఉంది. 141 మ్యాచ్‌ల్లో 48.56 సగటుతో 9,908 పరుగులు చేశాడు.

ట్రెండింగ్ వార్తలు