Meghalaya, Nagaland Assembly Polling 2023: ముగిసిన పోలింగ్… ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడి

ఈశాన్య భారత్‌లోని మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇంతకు ముందే త్రిపురలోనూ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మూడు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. 

Meghalaya, Nagaland Assembly Polling 2023: ఈశాన్య భారత్‌లోని మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇవాళ పోలింగ్ జరిగింది. ఇంతకు ముందే త్రిపురలోనూ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మూడు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 27 Feb 2023 07:37 PM (IST)

    నాగాలాండ్ లో బీజేపీ, ఎన్డీపీపీకి తిరుగులేని మెజార్టీ!

    Exit poll results: నాగాలాండ్ లో బీజేపీ, ఎన్డీపీపీ కూటమి తిరుగులేని మెజార్టీతో గెలుపొందుతుందని జీ న్యూస్-మాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్ లో తేలింది. నాగాలాండ్ లోని 60 సీట్లలో బీజేపీ, ఎన్డీపీపీ కూటమికి 35-43 మధ్య సీట్లు వస్తాయని, కాంగ్రెస్ కు 1-3 సీట్లు రావచ్చని, ఎన్డీఎఫ్ కు 2-5 మధ్య సీట్లు వస్తాయని అంచనా వేసింది.

  • 27 Feb 2023 07:22 PM (IST)

    Exit poll results: మేఘాలయాలో ఎన్పీపీ

    మేఘాలయాలోని 60 సీట్లలో నేషనల్ పీపుల్స్ పార్టీ 21-26 సీట్లు గెలుచుకుంటుందని జీ న్యూస్-మాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్ లో తేలింది. టీఎంసీ 8-13 మధ్య, బీజేపీ 6-11 మధ్య, కాంగ్రెస్ 3-6 మధ్య సీట్లు గెలుచుకుంటాయని అంచనా వేసింది.

    మేఘాలయాలోని నేషనల్ పీపుల్స్ పార్టీ 18-26 సీట్లు గెలుచుకుంటుందని టైమ్స్ నౌ-ఈటీజీ రీసెర్చ్ అంచనా వేసింది. బీజేపీ 3-6 మధ్య, కాంగ్రెస్ 2-5 మధ్య సీట్లు గెలుచుకుంటాయని తెలిపింది.

    మేఘాలయాలో నేషనల్ పీపుల్స్ పార్టీ 18-24 సీట్లు గెలుచుకుంటుందని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ లో తేలింది. బీజేపీ 4-8 మధ్య, కాంగ్రెస్ 6-12 మధ్య సీట్లు గెలుచుకుంటాయని అంచనా వేసింది.

  • 27 Feb 2023 07:20 PM (IST)

    Exit poll results: త్రిపురలో బీజేపీ హవా!

    త్రిపురలోని 60 సీట్లలో బీజేపీ 36-45 మధ్య సీట్లు గెలుచుకుంటుందని ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ లో తేలింది. వామపక్ష పార్టీలు 6-11 సీట్లు గెలుస్తాయని అంచనా వేసింది.

    జీ న్యూస్-మాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్ లోనూ బీజేపీ గెలుస్తుందని తేలింది. త్రిపురలో బీజేపీకి 29-36 సీట్లు వస్తాయని, వామపక్ష పార్టీలు 13-21 మధ్య సీట్లు గెలుచుకుంటాయని జీ న్యూస్-మాట్రిజ్ తెలిపింది.

  • 27 Feb 2023 07:12 PM (IST)

    ఎగ్జిట్ పోల్స్

    మేఘాలయా, నాగాలాండ్ లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇంతకు ముందే త్రిపురలోనూ ఎన్నికలు జరిగాయి. దీంతో పలు సంస్థలు ఆ మూడు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి.

  • 27 Feb 2023 06:42 PM (IST)

    5 గంటల వరకు ఓటింగ్ శాతం

    మేఘాలయాలో సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ శాతం 74.32గా నమోదైంది.

  • 27 Feb 2023 05:06 PM (IST)

    3 గంటల వరకు ఓటింగ్ శాతం

    మేఘాలయాలో మధ్యాహ్నం 3 గంటల వరకు ఓటింగ్ 63.91 శాతంగా నమోదైంది. నాగాలాండ్ లో 72.99 శాతం నమోదైందని అధికారులు తెలిపారు.

  • 27 Feb 2023 01:54 PM (IST)

    మేఘాలయ 44శాతం, నాగాలాండ్‌ 57శాతం..

    మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంది. ఓటుహక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. దీంతో మధ్యాహ్నం 1గంట సమయానికి మేఘాలయలో 44.73శాతం ఓటింగ్ నమోదు కాగా, నాగాలాండ్ రాష్ట్రంలో 57.62శాతం మంది ఓటర్లు ఓటు వేశారు.

  • 27 Feb 2023 01:22 PM (IST)

    Nagaland Assembly Polling 2023

  • 27 Feb 2023 01:16 PM (IST)

    మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా తురా, గారో హిల్స్‌లోని వాల్‌బాక్రే -29 పోలింగ్ స్టేషన్‌లో ఓటు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు.

     

    Meghalaya Assembly Elections

  • 27 Feb 2023 01:13 PM (IST)

    అంపాటి నుంచి టీఎంసీ అభ్యర్థి మియాని డి షిరా, మాజీ సీఎం ముకుల్ సంగ్మా కుమార్తె మేఘాలయ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్నారు.

    Meghalaya Assembly Polling

  • 27 Feb 2023 12:49 PM (IST)

    ఉదయం 11 గంటలకు ఓటింగ్ శాతం ..

    మేఘాలయ, నాగాలాండ్ లలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం నుంచి ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకొనేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు తరలివస్తున్నారు. కాగా ఉదయం 11గంటల వరకు మేఘాలయలో 26.7 శాతం ఓట్లు పోలవ్వగా, నాగాలాండ్‌లో 38.2 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు.

  • 27 Feb 2023 12:46 PM (IST)

    నాగాలాండ్ సీఎం, ఎన్డీపీపీ అభ్యర్థి నెయిఫియూ రియో కహిమా జిల్లాలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

     

  • 27 Feb 2023 11:43 AM (IST)

    మేఘాలయ రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో బంగ్లాదేశ్, అస్సాంతో కూడిన సరిహద్దును అధికారులు మూసివేశారు. ఆ ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. బంగ్లాదేశ్‌తో మేఘాలయ అంతర్జాతీయ సరిహద్దు కలిగి ఉంది. అంతేకాక అస్సాంతో రాష్ట్ర సరిహద్దును కలిగిఉంది. ఈ రెండు సరిహద్దులను మూసివేసినట్లు మేఘాలయ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎఫ్ఆర్ ఖార్కోంగోర్ చెప్పారు.

  • 27 Feb 2023 11:41 AM (IST)

    నాగాలాండ్ బీజేపీ చీఫ్ టెంజెన్ ఇమ్నా అలంగ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. తను పోలింగ్ కేంద్రానికి వెళ్లిన  వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.

  • 27 Feb 2023 11:28 AM (IST)

    మేఘాలయ బీజేపీ చీఫ్, వెస్ట్ షిల్లాంగ్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఎర్నెస్ట్ మౌరీ పశ్చిమ షిల్లాంగ్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుస్తానని దీమాను వ్యక్తంచేశారు.

  • 27 Feb 2023 10:30 AM (IST)

    మేఘాలయలో లెప్రసీ కాలనీలో కుష్టురోగుల కోసం ఏర్పాటు చేసిన రాష్ట్రంలో తొలి తాత్కాలిక పోలింగ్ కేంద్రం..

  • 27 Feb 2023 10:22 AM (IST)

    ఉదయ 9గంటలకు పోలింగ్ శాతం వివరాలు..

    నాగాలాండ్‌ రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతుంది. ఉదయం 7గంటల నుంచే ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. దీంతో ఉదయం 9గంటల వరకు ఆ రాష్ట్రంలో 14.87 శాతం ఓటింగ్ నమోదైంది.

    మేఘాలయ రాష్ట్రంలో ఉదయం 9గంటల వరకు 12.6 శాతం పోలింగ్ జరిగింది.

  • 27 Feb 2023 09:28 AM (IST)

    తొలి ఐదుగురు ఓటర్లకు మెమెంటోలు..

    మేఘాలయ రాష్ట్రంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకున్న తొలి ఐదుగురు ఓటర్లకు ఎన్నికల అధికారులు మెమెంటోలను అందజేశారు. ముందస్తు ఓటింగ్ ను ప్రోత్సహించేందుకు ఈ మెమెంటోలను అందజేసినట్లు అధికారులు తెలిపారు.

  • 27 Feb 2023 09:22 AM (IST)

    కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ట్వీట్ ..

    మేఘాలయ, నాగాలాండ్ ప్రజలు ప్రగతిశీల, సంక్షే ఆధారిత ప్రభుత్వాల వైపు చూస్తున్నారు. మెరుగైన భవిష్యత్తు కోసం ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనేందుకు మొదటి సారి ఓటు హక్కు వినియోగించుకొనే వారికి స్వాగతం అంటూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ట్విట్ ద్వారా తెలిపారు.

  • 27 Feb 2023 09:13 AM (IST)

    నాగాలాండ్ రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటింగ్ ప్రక్రియను సీఈఓ కార్యాలయం వద్ద వెబ్‌కాస్ట్ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షిస్తున్న ఎలక్షన్ కమిషన్ సిబ్బంది.

  • 27 Feb 2023 09:06 AM (IST)

    మార్చి 2న ఫలితాలు ..

    ఈరోజు జరుగుతున్న నాగాలాండ్, మేఘాలయ ఎన్నికలతో పాటు ఇటీవల త్రిపురలో జరిగిన పోలింగ్ కు సంబంధించి ఫలితాలను మార్చి 2న వెల్లడిస్తారు.

  • 27 Feb 2023 09:02 AM (IST)

    మేఘాలయ అసెంబ్లీ పోలింగ్ వివరాలు ..

  • 27 Feb 2023 08:58 AM (IST)

    35 మంది ఓటర్లకోసం పోలింగ్ కేంద్రం

    మేఘాలయలోని అమ్మారెమ్ నియోజకవర్గ పరిధిలోని కామ్సింగ్ పోలింగ్ కేంద్రం పరిధిలో 35మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఎన్నికల సిబ్బంది పడవ సాయంతో నదిని దాటుకొని వెళ్లి అక్కడ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు.

  • 27 Feb 2023 08:55 AM (IST)

    మేఘాలయ రాష్ట్రంలో 59 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 369 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 36 మంది మహిళ అభ్యర్థులు ఉన్నారు. ఈ రాష్ట్రంలో అన్ని పార్టీలు ఒంటరిగానే పోటీ చేస్తున్నాయి. అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ), ప్రతిపక్ష కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ తీవ్రంగా కనిపిస్తోంది.

  • 27 Feb 2023 08:54 AM (IST)

    మేఘాలయ రాష్ట్రంలో 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సోహియాంగ్ నియోజకవర్గంలో ఓ అభ్యర్థి మరణించడంతో ఎన్నిక వాయిదా పడింది. 59 అసెంబ్లీ నియోజక వర్గాల్లో 3,419 పోలింగ్ కేంద్రాల్లో ఈ రోజు పోలింగ్ జరుగుతుంది. 21,75,236 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం ఓటర్లలో 10.99 లక్షల మంది మహిళలు, 10.68 లక్షల మంది పురుషులు ఉన్నారు. వీరిలో 81వేల మంది మొదటి సారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

  • 27 Feb 2023 08:49 AM (IST)

    ప్రతీఒక్కరు ఓటుహక్కు వినియోగించుకోవాలి.. అమిత్ షా ట్వీట్

    మేఘాలయలో ఓటు వేయనున్నందున, రాష్ట్రంలో అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నానని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్విటర్ ద్వారా కోరారు. క్లీన్ గవర్నెన్స్ వల్ల ప్రభుత్వ పథకాలు పేదలకు అందేలా, వారి జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చేలా కృషి జరుగుతుంది. పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి ప్రతీఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి.

     

    నాగాలాండ్ రాష్ట్రంలో ఈ రోజు జరిగే పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతీఒక్కరూ కృషిచేయాలి. శాంతి ప్రక్రియకు ఎలాంటి అడ్డంకులు రాకుండా చూసుకోవాలని నాగాలాండ్ సోదరీమణులను కోరుతున్నా అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు. శాంతి మాత్రమే నాగాలాండ్ రాష్ట్రంను పురోగతి, అభివృద్ధి వైపు నడిపిస్తుందని అమిత్ షా అన్నారు.

  • 27 Feb 2023 08:39 AM (IST)

    నాగాలాండ్‌లో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓటింగ్ జరుగుతోంది.

  • 27 Feb 2023 08:38 AM (IST)

    నాగాలాండ్‌ రాష్ట్రంలో ఉదయం నుంచి పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పోటెత్తారు. రాష్ట్రంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 75శాతం ఓటింగ్ నమోదుకాగా, 2013లో 90.57 శాతం ఓటింగ్ నమోదైంది.

  • 27 Feb 2023 08:36 AM (IST)

    రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం నమోదు కావాలి .. ప్రధాని మోదీ ట్వీట్

    మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. మేఘాలయ, నాగాలాండ్ ప్రజలు, ముఖ్యంగా యువత, మొదటి సారి ఓటుహక్కు వినియోగించుకునే ఓటర్లు ప్రతీఒక్కరూ ఓటుహక్కును సద్వినియోగంచేసుకోవాలి. రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం నమోదు కావాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు.

     

  • 27 Feb 2023 08:29 AM (IST)

    నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీపీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. ఎన్‌డీపీపీ అభ్యర్థులు 40 స్థానాల్లో పోటీ చేస్తుండగా, బీజేపీ అభ్యర్థులు 20 స్థానాల్లో బరిలో నిలిచారు. రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్‌ 23 స్థానాల్లో, ఎన్‌పీఎఫ్‌ 22 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. రెండు పార్టీలు ఎన్నికల అనంతర పొత్తు ఆలోచనకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రధానంగా బీజేపీ, ఎన్‌డీపీపీ కూటమికి కాంగ్రెస్, ఎన్‌పీపీ, ఎన్సీపీ, జేడీయూల నుంచి గట్టిపోటీ ఎదురవుతుంది.

  • 27 Feb 2023 08:13 AM (IST)

    నాగాలాండ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా ఎన్నిక కాలేదు. రాష్ట్రంలో మహిళల జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ.. వారికి శాసనసభలో అడుగుపెట్టేందుకు అవకాశం లభించలేదు. ఎన్నికల బరిలో నిలిచినప్పటికీ విజయం సాధించలేక పోయారు. ఈసారి నలుగురు మహిళలు పోటీలో ఉన్నారు. దీమాపూర్-3 నియోజకవర్గం నుంచి నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ (ఎన్‭డీపీపీ) అభ్యర్థిగా హేఖాని జఖలు, టేనింగ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రోసీ థాంప్సన్, పశ్చిమ అంగామి స్థానం నుంచి ఎన్‭డీపీపీ అభ్యర్థి సల్హోటువోనువో, అటోయిజు నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కాహులి సెమా అనే నలుగురు మహిళా అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో ఎవరు విజయం సాధించినా ఆ రాష్ట్రంలో సరికొత్త రికార్డు నమోదైనట్లే.

  • 27 Feb 2023 08:07 AM (IST)

    మేఘాలయ రాష్ట్రంలోని పశ్చిమ ఖాసీ‌హిల్స్ ప్రాంతంలో పర్యావరణ అనుకూల మోడల్ పోలింగ్ స్టేషన్

     

  • 27 Feb 2023 08:04 AM (IST)

    నాగాలాండ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ రాష్ట్రంలో మొత్తం 60 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అకులుటో అసెంబ్లీ నియోజకవర్గం ఏకగ్రీవం అయింది. దీంతో 59 నియోజకవర్గాల్లో మాత్రమే పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 183 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 13,17,632 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 6,61,489 మంది పురుషులు కాగా, 6,56,143 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,351 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.

  • 27 Feb 2023 07:59 AM (IST)

    మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది.

ట్రెండింగ్ వార్తలు