Bholaa Shankar : మిల్కీ బ్యూటీతో చిరు డేటింగ్ పార్టీ.. మెలోడీ సాంగ్ అదిరిపోయింది..

చిరంజీవి భోళా శంకర్ నుంచి మిల్కీ బ్యూటీ సాంగ్ రిలీజ్ అయ్యింది. మెలోడీ సాంగ్ కి చిరు అండ్ తమన్నా స్టెప్స్ అదుర్స్.

Milky Beauty Lyrical Song released from Chiranjeevi Bholaa Shankar

Bholaa Shankar : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా(Tamannaah).. సైరా నరసింహారెడ్డి తరువాత మరోసారి జంటగా కనిపిస్తూ చేస్తున్న సినిమా ‘భోళా శంక‌ర్’ (Bhola Shankar). స్టైలిష్ డైరెక్టర్ మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. మరో హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) ఈ సినిమాలో చిరుకి చెల్లిగా కనిపించబోతుంది. అక్కినేని హీరో సుశాంత్‌, శ్రీముఖి, రష్మీ, వెన్నెల కిశోర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Prabhas : కామిక్ కాన్ ఈవెంట్‌లో ప్రభాస్ స్పెషల్ AV చూశారా.. అదిరిపోయింది.. గూస్‌బంప్స్ అంతే..

ఆగ‌స్టు 11న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. అలాగే మరో పక్క ప్రమోషన్ పనులు కూడా మొదలు పెట్టింది చిత్ర యూనిట్. ఈ క్రమంలోనే మూవీలోని సాంగ్స్ ని ఒక్కోటిగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి భోళా మ్యానియా, పార్టీ సాంగ్ రిలీజ్ చేశారు. తాజాగా డ్యూయెట్ సాంగ్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. చిరు అండ్ తమన్నా పై స్విట్జర్లాండ్ లో తెరకెక్కించిన మెలోడీ సాంగ్ ని రిలీజ్ చేశారు.

Prabhas : ఎన్టీఆర్, చరణ్‌తో సినిమా ఉంటుంది.. ప్రభాస్ చేసిన కామెంట్స్ మహాభారతం గురించేనా..?

మహతి స్వర సాగర్ స్వర కల్పనలో వచ్చిన ‘మిల్కీ బ్యూటీ’ పాటకి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. మహతి, విజయ్ ప్రకాష్, సంజన కలమంజే పాటని పాడారు. ఈ పాటని టాప్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ రిలీజ్ చేశాడు. కాగా ఈ మూవీ తమిళ్ సూపర్ హిట్ మూవీ ‘వేదాళం’కి రీమేక్ గా తెరకెక్కుతుంది. గ్యాంగ్ స్టార్ నేపధ్యానికి సిస్టర్ సెంటిమెంట్ ని కలిపి ఆడియన్స్ కి మాస్ అండ్ క్లాస్ టచ్ ఇవ్వబోతున్నారు.

ట్రెండింగ్ వార్తలు