Prabhas special AV at Comic Con 2023 event gone viral in social media
Prabhas : ప్రభాస్ (Prabhas) సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ K టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ ని అమెరికా కాలిఫోర్నియాలోని San Diegoలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఈవెంట్ కామిక్ కాన్ లో గ్రాండ్ గా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో పాల్గొన్న మొదటి ఇండియన్ సినిమాగా ప్రాజెక్ట్ K సరికొత్త రికార్డ్ సెట్ చేయడమే కాకుండా.. అక్కడ అద్భుతమైన రెస్పాన్స్ ని కూడా అందుకుంది. ఈ ఈవెంట్ లో ఈ చిత్ర దర్శక నిర్మాతలతో పాటు ప్రభాస్, కమల్ హాసన్, రానా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభాస్ ని ఆడియన్స్ కి పరిచయం చేస్తూ కామిక్ కాన్ నిర్వాహకులు వేసిన స్పెషల్ AV అందర్నీ ఆకట్టుకుంటుంది.
Bholaa Shankar : మిల్కీ బ్యూటీతో చిరు డేటింగ్ పార్టీ.. మెలోడీ సాంగ్ అదిరిపోయింది..
ఆ AV లో బాహుబలిలోని సీన్స్, అలాగే ప్రభాస్ ఆడియో ఫంక్షన్స్ టైంలో వేలల్లో వచ్చిన అభిమానులు చూపిస్తూ ఇండియాలో రెబల్ స్టార్ ఫాలోయింగ్ ఏంటో చూపించారు. ఆ AV చూస్తే ప్రతి ఒక్కరికి గూస్బంప్స్ రావాల్సిందే. ఇక హాలీవుడ్ స్టేజి పై ప్రభాస్ కి ఒక రేంజ్ లో ఎలివేషన్ ఇస్తూ స్పెషల్ AV పడడంతో రెబల్ అభిమానులు అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఆ వీడియోని చూడకపోతే ఒకసారి మీరుకూడా చూసేయండి.
Prabhas : ఎన్టీఆర్, చరణ్‌తో సినిమా ఉంటుంది.. ప్రభాస్ చేసిన కామెంట్స్ మహాభారతం గురించేనా..?
Goosebumps 💥💥
Rebelstar #Prabhas special AV at @Comic_Con #SDCC2023 #ProjectKStar star REBELSTAR 👑🔥🔥 pic.twitter.com/zxOtF5pelK
— Prabhas Trends (@TrendsPrabhas) July 20, 2023
కాగా ఈ మూవీకి అందరూ ఊహించినట్టే కల్కి (Kalki 2898 AD) అని టైటిల్ నే ఖరారు చేశారు. ఈ సినిమాలో తన క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో కూడా ప్రభాస్ ఈ ఈవెంట్ లో తెలియజేశాడు. ఈ మూవీలో ప్రభాస్ సూపర్ హీరోగా కనిపించబోతున్నాడు. అదిరిపోయే యాక్షన్ ఫైట్స్ చేస్తూనే మంచి కామెడీని జనరేట్ చేస్తుందట ప్రభాస్ క్యారెక్టర్. ఇక రిలీజ్ చేసిన గ్లింప్స్ లోని విజువల్స్ కూడా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. దీంతో మూవీ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.