Telangana Politics: కూతురు, అల్లుడి వ్యవహారంపై కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి

నీతిగా ప్రజా క్షేత్రంలో ఎదుర్కోవాలి తప్ప.. నా బిడ్డను, అల్లుడిని ప్రేరేపించడం మంచిది కాదు. రాజ్యాంగబద్ధంగా నా బిడ్డను ఏమనే పరిస్థితి లేక తప్పని పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయించాను. ఆ స్థలంలో నా బిడ్డ నిర్మాణం చేసుకుంటానని చెప్పింది. కానీ అలాంటి నా బిడ్డను మీస్ గైడ్ చేసి రోడుపై వేస్తున్నారు

Muthireddy Yadagiri Reddy: తన కూతురు, అల్లుడు తనను ఇబ్బందులు గురి చేస్తున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. అమాయకురాలైన తన కూతురిని అడ్డుపెట్టుకుని అల్లుడిని ప్రేరేపించడం అధర్మమని ఆయన మండిపడ్డారు. కష్టం చేసుకుని బతుకుతున్న తన కూతురిని మూర్ఖులు, దౌర్భాగ్యులు రోడ్డు పాలు చేస్తున్నారని ముత్తిరెడ్డి అన్నారు. ఇలాంటి చర్యలు సమాజానికి మంచిది కాదని, వారికి అరిష్టం కలుగుతుందని ముత్తిరెడ్డి అన్నారు.

MLA Grandhi Srinivas : పవన్ ప్రసంగంలో అన్నీ అబద్దాలే..ప్యాకేజీ పార్టీ అని మరోసారి రుజువు చేసారు : ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

కొంత కాలంగా ముత్తిరెడ్డిపై ఆయన సొంత కూతురే తీవ్ర అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. నియోజకవర్గంలోని చేర్యాల పట్టణంలో తన పేరుమీదున్న 23 గుంటల భూమిని తన తండ్రి కబ్జా చేసి తనకు తెలియకుండా తన పేరు మీద రిజిస్టర్ చేయించారంటూ, ఆ భూమిని చేర్యాల ఆసుపత్రికి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదే కాకుండా తండ్రిపై అనేక ఆరోపణలు చేసింది తుల్జా భవానీ రెడ్డి.

BRS Party: బీఆర్ఎస్‌లో దూకుడు పెంచుతున్న అసంతృప్తులు, ఆశావహులు.. కాంగ్రెస్ తో టచ్‌లోకి కొందరు నేతలు!

ఈ వివాదాల నేపథ్యంలో శనివారం మీడియాతో ముత్తిరెడ్డి మాట్లాడుతూ ‘‘నీతిగా ప్రజా క్షేత్రంలో ఎదుర్కోవాలి తప్ప.. నా బిడ్డను, అల్లుడిని ప్రేరేపించడం మంచిది కాదు. రాజ్యాంగబద్ధంగా నా బిడ్డను ఏమనే పరిస్థితి లేక తప్పని పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయించాను. ఆ స్థలంలో నా బిడ్డ నిర్మాణం చేసుకుంటానని చెప్పింది. కానీ అలాంటి నా బిడ్డను మీస్ గైడ్ చేసి రోడుపై వేస్తున్నారు. లాంటి వారిని భగవంతుడు క్షమించడు. ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాసేవ చేయాలి కాబట్టి నేను ప్రజాసేవలోనే ఉంటాను. ప్రజాసేవకు భంగం కలగకుండా ఉండేందుకే హైకోర్టును ఆశ్రయించాను. ప్రజాసేవ చేయాల్సిందిగా హైకోర్టు కూడా ఆదేశించింది’’ అని అన్నారు.

MP Nandigam Suresh : వైసీపీ పోవటం తర్వాత నువ్వు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ గేటు దాటు చూద్దాం : పవన్ కల్యాణ్ కు వైసీపీ ఎంపీ సవాల్

ఇంకా ఆయన మాట్లాడుతూ తన కూతురు ప్రజలకు స్థలాన్ని దానం ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. చదువుకున్న తన కూతురిని, ప్రజా క్షేత్రంలో తనను ఎదుర్కోలేక దమ్ములేని దృష్టులు తన కూతురిని రోడ్డుమీద వేస్తున్నారని ఆరోపించారు. ఇది క్షమించరాని దుర్మార్గపు చర్య అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. శక్తి ఉంటే ప్రజాసేవ చేసి, ప్రజా మన్నలను చేరగొనాలి తప్ప ఇలాంటి అడ్డమైన పనులు చేయకూడదని ముత్తిరెడ్డి హెచ్చరించారు.

ట్రెండింగ్ వార్తలు