MLA Grandhi Srinivas : పవన్ ప్రసంగంలో అన్నీ అబద్దాలే..ప్యాకేజీ పార్టీ అని మరోసారి రుజువు చేసారు : ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

పవన్ కల్యాణ్ మహనీయుల పేర్లు చెబుతు నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. పవన్ పార్టీ పెట్టీ చంద్రబాబును సీఎం చేయాలని చూస్తున్నారు తప్ప తన కోసం కాదు.

MLA Grandhi Srinivas..Pawan Kalyan

Pawan Kalyan’s Bhimavaram public meeting : భీమవరంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బహిరంగ సభ గురించి పశ్చిమ గోదావరి..జిల్లా భీమవరం MLA గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతు..పవన్ భీమవరం సభలో ఏదో చెబుతారనుకుంటే ఏమీ చెప్పకుండా తుస్సుమనిపించారు అంటూ ఎద్దేవా చేశారు.భీమవరం సభపై సస్పెన్స్ క్రియేట్ చేసిన పవన్ కళ్యాణ్ ప్రసంగం తుస్సుమనిపించారు అంటూ సెటైర్లు వేశారు.

యువకులు, రైతులు, శ్రామికులు మోసపోతున్నారు అంటూ పవన్ చెప్పినవన్నీ అబద్దాలేనని కొట్టిపారేశారు. అబద్దాల ప్రసంగాలు చేసే ప్యాకేజీ పార్టీ.. అబద్దాల పార్టీ అని మరోసారి రుజువు చేసారు అంటూ విమర్శించారు.సీఎం జగన్ మ్యానిఫెస్టోను భగవద్గీతా, బైబిల్, ఖురాన్ గా భావిస్తారని..ప్రభుత్వం అంటే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా భావించే వ్యక్తి సీఎం జగన్ అంటూ ప్రశంసించారు.పవన్ తనని తాను మోసం చేసుకుంటూన్నారని..మహనీయుల పేర్లు చెబుతు నీచమైన రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టీ చంద్రబాబును సీఎం చేయాలని చూస్తున్నారు తప్ప తన కోసం కాదన్నారు.

Pawan Kalyan: వ్యక్తిగత విషయాలపై మాట్లాడడం చిల్లర వ్యవహారం.. జగన్ వ్యక్తిగత జీవితం నాకు తెలుసు.. నేను చెప్పేది వింటే..

ముద్రగడ కుటుంబాన్ని చంద్రబాబు హింసిస్తే అన్ని వర్గాలు బాధ పడ్డాయని…మీరు చేసిన దాస్టీకాలు భరించ లేక ప్రజలు మిమ్మల్ని ఓడించారు అంటూ పవన్ పైనా..టీడీపీపైనా విరుచుకుపడ్డారు గ్రంధి.2019లో విడివిడిగా పోటీ చేస్తున్నాం అంటూ ప్రజలకు చెవిలో పువ్వు పెట్టే ప్రయత్నం చేశారని..పవన్ ఉసరవెల్లి కంటే ఎక్కువ రంగులు మార్చుకున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.నాకు సీఎం పదవి ఎవరు ఇస్తారని పవన్ మాట్లాడారు..నాకు మీరంతా ఓట్లు వేయలేదంటు సొంత పార్టీ వాళ్ళను అవమానిస్తున్నారని అన్నారు.మహనీయుల పేర్లు పలుకుతూ వారికి అపవిత్రత ఆపాదిస్తున్నారంటూ విమర్శించారు.పోరాటంలో ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్ పేరు చెబుతు ఒంటరిగా వెళ్లి ఆత్మార్పణ చేయాల్సిన పని లేదంటారు..చంద్రబాబు మద్యపాన నిషేదం ఎత్తేశారు కాబట్టి ఇపుడు ఆయన్ని సపోర్ట్ చేస్తూ మద్యపాన నిషేదం సాధ్యం కాదంటున్నారు పవన్ ఇదీ ఆయన తీరు అంటూ ఎద్దేవా చేశారు.

పవన్ కల్యాణ్ కు చంద్రబాబులో భగత్ సింగ్, పొట్టి శ్రీరాములు, చేగువేరా కనిపిస్తున్నారెమో అంటూ ఎద్దేవా చేశారు.భీమవరం వచ్చి డంపింగ్ యార్డ్ గురించి మాట్లాడిన పవన్ అంతకు ముందు 10ఏళ్లు ఎమ్మెల్యే గా ఉన్న వారిని ఎందుకు ప్రశ్నించలేదు? ఇప్పుడే ఆ డంపింగ్ యార్డ్ గురించి గుర్తుకొచ్చిందా? అంటూ మండిపడ్డారు. డప్పింగ్ యార్డ్ కోసం రహస్యంగా కార్యాచరణ చేస్తున్నామని తెలిపారు.జగన్మోహన్ రెడ్డిలా ప్రజలకు మంచి చేయాలంటే పవన్ కల్యాణ్ 100 జన్మలు ఎత్తాలి అంటూ పవన్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్.

KethiReddy Venkatarami Reddy : చిరంజీవి చాలా మంచి వారు, అయినా ఓడిపోయారు.. చంద్రబాబు 7సార్లు దొంగ ఓట్లతోనే గెలిచారు




											




                                    

ట్రెండింగ్ వార్తలు