Pawan Kalyan: వ్యక్తిగత విషయాలపై మాట్లాడడం చిల్లర వ్యవహారం.. జగన్ వ్యక్తిగత జీవితం నాకు తెలుసు.. నేను చెప్పేది వింటే..

రైతాంగానికి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని నిలదీశారు.

Pawan Kalyan

Pawan Kalyan – Bhimavaram: ” మనకు గెలుపు, ఓటమి ఉండవు.. ప్రమాణమే ఉంటుంది ” అని జనసేన (JanaSena) నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తన పోరాటాన్ని ఆపబోనని చెప్పారు. జెండా సేన జెండా ఎగరాలని, తమ పార్టీ సత్తా అసెంబ్లీలో చాటాలని అన్నారు.

వ్యక్తిగత విషయాలపై మాట్లాడడం చిల్లర వ్యహారమని పవన్ కల్యాణ్ అన్నారు. జగన్ వ్యక్తిగత జీవితం తనకు తెలుసని చెప్పారు. తాను చెప్పేది వింటే జగన్ చెవుల నుంచి రక్తం వస్తుందని అన్నారు. వైసీపీ నేతలు నోటికి సైలెన్సర్లు బిగించుకోవాలని హెచ్చరించారు.

” జగన్ కు చెబుతున్నా… ఇలాగే వ్యక్తిగత జీవితాల గురించి, పనికిమాలిన మాటలు మాట్లాడితే చూస్తూ ఉండను, ఇది వార్నింగ్ అనుకో.. బలమైన సమాధానం ఇవ్వబోతున్నాము, సిద్ధంగా ఉండు. చెవులు విప్పుకుని విను.. నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నావ్, నీ వ్యక్తిగత జీవితం క్షణక్షణం నాకు తెలుసు, మాట్లాడమంటావా? మీ నాయకులు ఎవరినైనా పంపించు నేను చెబుతాను, నీ వ్యక్తిగత జీవితం గురించి నేను చెప్పేది వింటే చెవుల్లోంచి రక్తం వస్తుంది జాగ్రత్త ” అని పవన్ వ్యాఖ్యానించారు.

గత ఎన్నికల్లో భీమవరంలో తాను ఓడిపోయినా పట్టించుకోలేదని, ప్రజల కోసం పోరాడుతూనే ఉన్నానని తెలిపారు. బ్రిటిష్ వారు వేలమంది వచ్చి కోట్ల మందిని పాలించినట్లు, వైసీపీ నాయకులు వచ్చి రాష్ట్రాన్ని నియంత్రిస్తామంటే కుదరదని అన్నారు. భీమవరంలో వైసీపీ కనీసం 100 పడకల ఆసుపత్రిని కూడా నిర్మించలేకపోయిందని చెప్పారు.

రైతాంగానికి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (Yuvajana Sramika Rythu Congress Party- YSRCP) ఏం చేసిందని నిలదీశారు. కనీసం రైతులకు గిట్టుబాటు ధర ఉండదని చెప్పారు. సమయానికి పంట కొనడం లేదని అన్నారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేదం అమలు కష్టమని చెప్పారు. జనసేన అధికారంలోకి వస్తే పాత రేట్లకే మద్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు.

మద్యం ఆదాయంలో 10 శాతం గీత కార్మికుల నిధికి ఉపయోగిస్తామని చెప్పారు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి, లక్ష కోట్ల రూపాయల ఆదాయం మద్యం మీద సంపాదించిన వ్యక్తి జగన్ అని అన్నారు. గంజాయిని రాష్ట్ర పంటగా మార్చారని చురకలు అంటించారు. రాష్ట్ర సమస్యలపై తాము పదేళ్లుగా పోరాటం చేస్తున్నామని అన్నారు.

జగన్ వస్తే చెట్లను కూడా కొట్టేస్తున్నారని చెప్పారు. పచ్చని చెట్లు కూడా మౌన పోరాటం చేస్తున్నాయని అన్నారు. అన్నిటినీ తట్టుకుని నిలబడుతున్నామని చెప్పారు. యువతకు వైసీపీ ఏం చేసిందని నిలదీశారు. డబ్బు మనది సోకు ఆయనది అంటూ జగన్ పై విమర్శలు గుప్పించారు.

Telangana: బీజేపీలో కీలక పరిణామాలు.. పార్టీ తెలంగాణ అధ్యక్షుడి మార్పుపై విజయ రామారావు సంచలన వ్యాఖ్యలు.. ఢిల్లీకి కె.లక్ష్మణ్

ట్రెండింగ్ వార్తలు