Maha vs Karnataka: ముంబై ఎవడి బాబు సొత్తు కాదు, అదెప్పటికీ మహారాష్ట్రదే.. డిప్యూటీ సీఎం ఫడ్నవీస్

బెళగావిని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని మహారాష్ట్ర నేతలు అంటున్నారు. కానీ నేను వారికి ఒక విషయం చెప్పదల్చుకున్నాను. దేశంలో మూడు-నాలుగు నగరాల్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయొచ్చు. అందులో ముంబై మొదటి స్థానంలో ఉంటుంది. బాంబే ప్రెసిడెన్సీ ఉన్నప్పుడు అది కేంద్రపాలిత ప్రాంతంలాగే ఉండేది

Maha vs Karnataka: మహారాష్ట్ర-కర్ణాటక రాష్ట్రాల మధ్య మొదలైన సరిహద్దు వివాదం మరింత వేడిగా మారుతోంది. రోజుకొక కొత్త ఆరోపణతో, కొత్త డిమాండుతో రాజకీయ వేడి పుట్టిస్తోంది. రెండు రోజుల క్రితం కర్ణాటకలోని బెళగావి ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలంటూ శివసేన పార్టీ డిమాండ్ చేసింది శివసే. దీనికి కౌంటర్ అటాక్‭గా బుధవారం కర్ణాటక మంత్రి జే మధు స్వామి స్పందిస్తూ మహారాష్ట్ర రాజధాని ముంబైని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని డిమాండ్ చేశారు. కాగా, దీనిపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ‘ముంబై ఎవడి బాబు సొత్తు కాదు. అదెప్పటికీ మహారాష్ట్రదే’ అంటూ కాస్త కఠువుగానే ఆయన సమాధానం ఇచ్చారు.

Pragya Thakur: హిందువులు కత్తులు వాడాలంటూ వ్యాఖ్యానించిన బీజేపీ ఎంపీ సాధ్వీపై కేసు

కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మధు స్వామి మాట్లాడుతూ ‘‘బెళగావిని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని మహారాష్ట్ర నేతలు అంటున్నారు. కానీ నేను వారికి ఒక విషయం చెప్పదల్చుకున్నాను. దేశంలో మూడు-నాలుగు నగరాల్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయొచ్చు. అందులో ముంబై మొదటి స్థానంలో ఉంటుంది. బాంబే ప్రెసిడెన్సీ ఉన్నప్పుడు అది కేంద్రపాలిత ప్రాంతంలాగే ఉండేది. ఒకవేళ దేశం మేలు గురించి వాళ్లు (మహారాష్ట్ర నేతలు) ఆలోచిస్తే ముంబైని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేందుకు ఒప్పుకోండి’’ అని అన్నారు.

Rahul Gandhi: ఎట్టకేలకు పెళ్లిపై సానుకూలంగా స్పందించిన రాహుల్ గాంధీ.. ఆ క్వాలిటీస్ ఉండే అమ్మాయి అయితే ఓకేనట

ఈ వ్యాఖ్యలపై మహారాష్ట్ర అసెంబ్లీలో ఫడ్నవీస్ స్పందిస్తూ ‘‘ముంబై మహారాష్ట్రకే చెందుతుంది. ఎవడి బాబు కాదు. ముంబై విషయంలో ఎవరు ఎలాంటి ఆరోపణలు, వ్యాఖ్యలు చేసినా మేము సహించం. కర్ణాటక మంత్రి వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కర్ణాటక ప్రభుత్వం తమ పరిధిలోని అంశాలపైనే స్పందించాలి. ప్రస్తుతం ఈ విషయం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. ఏం చేయాలనేది కేంద్రం నిర్ణయిస్తుంది’’ అని అన్నారు. అయితే ఈ వివాదంపై రెండు రోజుల క్రితం మహారాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసింది. కర్ణాటకలోని మరాఠీ మాట్లాడే గ్రామాల్లోని ఒక్క అంగుళం స్థలాన్ని సైతం ఒదులుకోబోమని తీర్మానంలో ప్రభుత్వం పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు