Naga Chaitanya : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన చైతూ.. కంగ్రాట్స్ బావ అంటూ వెంకీ కూతురి రిప్లై..

తాజాగా చైతూ ఫుడ్‌ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. షోయూ పేరుతో హైదరాబాద్‌లో సరికొత్త రెస్టారెంట్‌ ఓపెన్‌ చేశాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు........

Shoyu

Naga Chaitanya :  అక్కినేని నాగ చైతన్య ఇటీవల లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. వరుస ప్రాజెక్టులతో బిజీగా కూడా ఉన్నాడు. ఇటీవలే ‘థ్యాంక్యూ’ సినిమా షూట్ కంప్లీట్ చేసుకున్నాడు. బాలీవుడ్ లో అమీర్ తో కలిసి చేసిన ‘లాల్ సింగ్ చద్దా’ రిలీజ్ కి రెడీగా ఉంది. ఇక ఇటీవలే ఒక వెబ్ సిరీస్ చేస్తున్నట్టు కూడా ప్రకటించాడు. ఇలా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండి తాజాగా ఒక కొత్త బిజినెస్ మొదలుపెట్టాడు చైతూ.

తాజాగా చైతూ ఫుడ్‌ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. షోయూ పేరుతో హైదరాబాద్‌లో సరికొత్త రెస్టారెంట్‌ ఓపెన్‌ చేశాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. తన రెస్టారెంట్ కి సంబంధించిన వీడియో షేర్ చేస్తూ.. ”నాకు మంచి ఆహరం అంటే చాలా ఇష్టం. నేను ప్రపంచంలో చాలా చోట్ల వివిధ రకాల వంటలను తిన్నాను. అందులో ఆసియా వంటలు నాకు బాగా నచ్చుతాయి. అందుకే నేను చూసిన రుచులన్నీ మీకు కూడా అందించాలని అనుకుంటున్నాను. అవన్నీ షోయు ద్వారా ప్రెజెంట్ చేస్తున్నాను. ఇది మీకు అద్భుతమైన ఆసియన్ వంటకాలన్నీ అందిస్తుంది.” అని పోస్ట్ చేశాడు.

Nagababu : హెయిర్ డ్రెస్సర్‌కి మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు స‌హాయం.. అందుకేనా??

ఈ రెస్టారెంట్ స్విగ్గితో ఒప్పందం కుదుర్చుకొని డెలివరీ కూడా ఇస్తుంది. స్విగ్గిలో ఆర్డర్ చేసుకోండి అంటూ చైతూ ఈ వీడియోలో చెప్పాడు. ఇప్పటికే సెలబ్రిటీలంతా బిజినెస్ లలో సక్సెస్ అవుతున్నారు. మరి చైతూ ఈ రెస్టారెంట్ తో ఏ మేరకు సక్సెస్ సాధిస్తాడో చూడాలి. ఇక ఈ పోస్ట్ కి వెంకటేశ్‌ పెద్ద కూతురు ఆశ్రిత.. ‘ఈ కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు బావా’ అంటూ విషెస్‌ తెలిపింది. ఆశ్రిత కూడా వివిధ రకాల వంటలని ట్రై చేస్తూ వాటి గురించి తన యూట్యూబ్, సోషల్ మీడియాలలో పెడుతుంది.

Chaithu

 

ట్రెండింగ్ వార్తలు