Nagarjuna : ఏపీ సీఎం జగన్ ని కలిసిన నాగార్జున

ఏపీలో థియేటర్ల సమస్యలు ఇప్పుడిప్పుడే తొలుగుతున్నాయి. ఆన్లైన్ టికెటింగ్ విధానంపై ఇంకా చర్చ జరుగుతుంది. అంతే కాక టికెట్ రేట్లని కూడా ఇంకా పెంచాలి అని సినీ పరిశ్రమ నుంచి ఏపీ

Nagarjuna :  ఏపీలో థియేటర్ల సమస్యలు ఇప్పుడిప్పుడే తొలుగుతున్నాయి. ఆన్లైన్ టికెటింగ్ విధానంపై ఇంకా చర్చ జరుగుతుంది. అంతే కాక టికెట్ రేట్లని కూడా ఇంకా పెంచాలి అని సినీ పరిశ్రమ నుంచి ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తులు వెళ్లాయి. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది సినీ పరిశ్రమ. ఇలాంటి సమయంలో ప్రభుత్వాల సపోర్ట్ చాలా అవసరం. పరిశ్రమ నుంచి ప్రభుత్వాలని ఎవరో ఒకరు కలుస్తూనే ఉన్నారు. మొన్నటిదాకా చిరంజీవి, నాగార్జున ఇద్దరూ కలిసి రెండు రాష్ట్రాల సీఎంలని కలిశారు. తెలంగాణాలో థియేటర్ సమస్యలు తగ్గడంతో ఆ తర్వాత నిర్మాతలు వరుసగా ఏపీ ప్రభుత్వాన్ని కలుస్తున్నారు.

Bigg Boss 5 : ఎట్టకేలకు కెప్టెన్ అయిన షన్ను.. ఆనందంలో అభిమానులు

ఇప్పటికే సినీ నిర్మాతలు, సినీ పెద్దలు ఏపీ ప్రభుత్వాన్నికలిసారు. చిరంజీవి, నాగార్జున సీఎం జగన్ ని, మంత్రి పేర్ని నానిని కలిసి సినీ పరిశ్రమ సమస్యల్ని తెలిపారు. తాజాగా మరో సారి నిన్న నాగార్జున అమరావతిలో ఏపీ సీఎం జగన్ ని కలిశారు. ఈ సందర్భంగా విజయవాడ విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడారు. నాగార్జున మాట్లాడుతూ.. జగన్ నాకు మిత్రుడు, శ్రేయోభిలాషి. మాములుగా కలిశాము. ఎలాంటి స్పెషల్ అకేషన్ లేదు. ఇది కేవలం ఫార్మల్ మీటింగ్ మాత్రమే అని అన్నారు. మరి నాగార్జున ఒక్కడే ఎందుకు కలిశాడు అని అనుమానాలు తలెత్తుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు