Next Pandemic: మరో మహమ్మారి 2080లో వచ్చి తీరుతుందట!!

యావత్ ప్రపంచాన్ని రెండేళ్లుగా గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి లాంటి జబ్బు మళ్లీ రాబోతుందా.. దాదాపు వందేళ్ల క్రితం స్పానిష్ వైరస్ ఇలానే అల్లకల్లోలం సృష్టించింది.

Next Pandemic: యావత్ ప్రపంచాన్ని రెండేళ్లుగా గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి లాంటి జబ్బు మళ్లీ రాబోతుందా.. దాదాపు వందేళ్ల క్రితం స్పానిష్ వైరస్ ఇలానే అల్లకల్లోలం సృష్టించింది. మరో శతాబ్దం తర్వాత అలాంటి ఘటనలే చోటు చేసుకుంటాయా.. అంటే అవుననే అంటున్నారు నిపుణులు.

మరో 60 ఏళ్లలో ఇంకో మహమ్మారి వచ్చే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఇటలీలోని పడువా యూనివర్సిటీ, అమెరికాలోని డ్యూక్‌ యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తల బృందం చేసిన అధ్యయనంలో అత్యంత అరుదుగా సంభవించే ఇలాంటి వైరస్‌లు ఇప్పటివరకు అందరూ భావిస్తున్నట్టుగా వందేళ్లకోసారి అంటే 2080లో మరో ముప్పు రాబోతోందని హెచ్చరించారు.

ఈ అధ్యయనం వివరాలను ప్రొసీడింగ్స్‌ ఆఫ్‌ ది నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ అనే జర్నల్‌లో ప్రచురించారు.

అధ్యయనం ఎలా జరిగిందంటే:
అధ్యయనానికి నేతృత్వం వహించిన ఇటలీ శాస్త్రవేత్త డాక్టర్‌ మార్కో మరాని, బృందం ఈ అధ్యయనాన్ని కొత్త గణాంకాల పద్ధతిలో నిర్వహించారు. 400 ఏళ్లలో చికిత్స లేని మహమ్మారులకు సంబంధించిన గణాంకాలు సేకరించి, భవిష్యత్‌లో వచ్చే ముప్పుపై అధ్యయనం చేశారు.

ప్లేగు, స్మాల్‌పాక్స్, కలరా, టైఫస్, స్పానిష్‌ ఫ్లూ, ఇన్‌ఫ్లూయెంజా వంటి వ్యాధులు ఎప్పుడొచ్చాయి? మానవజాతిని ఎన్నేళ్ల పాటు పీడించాయి. తరచుగా ఇలాంటి మహమ్మారులు వచ్చే అవకాశం ఉంది? లాంటి వివరాలు సేకరించి దాని ఆధారంగానే భవిష్యత్‌లో ఎదురయ్యే ముప్పుపై అంచనాలు వేసినట్టుగా మార్కో మరాని వెల్లడించారు.

అధ్యయనం ప్రకారం..
ప్రపంచ దేశాలపై కొవిడ్‌-19 ఎలాంటి ప్రభావం చూపించిందో అలాంటి మహమ్మారి మళ్లీ ఏ సంవత్సరంలోనైనా రావడానికి 2% అవకాశం ఉంది.

2000వ సంవత్సరంలో పుట్టిన వాళ్లలో కొందరు కరోనా తరహా వైరస్‌ కల్లోలాన్ని జీవిత కాలంలో మరోసారి చూసే అవకాశం 38 శాతంగా ఉంది. మరికొందరికి 60 ఏళ్లు వచ్చేసరికి ఇలాంటి మహమ్మారిని ఎదుర్కోవాల్సి వస్తుంది.

50 ఏళ్లలో రకరకాల కొత్త వైరస్‌లు పుట్టుకొచ్చాయి. వచ్చే మరికొన్ని దశాబ్దాల్లో కరోనా వంటి వైరస్‌లు బయల్పడే అవకాశం మూడింతలు ఎక్కువగా ఉంటుంది. దీని ప్రకారం చూస్తే కరోనా లాంటి వైరస్‌ మరో 59 ఏళ్లకే వచ్చే ఛాన్స్‌ ఉంది.

1918–1920 మధ్య వచ్చిన ప్రాణాంతక వ్యాధి మరొకటి లేదు. మళ్లీ అలాంటి వ్యాధి సంభవించే ముప్పు ఏడాదికి 0.3 నుంచి 1.9% వరకు పెరుగుతూ ఉంటుంది. మళ్లీ 400 ఏళ్ల లోపు ఆ తరహా వ్యాధి బయటపడే అవకాశం ఉంటుంది. మరో 12 వేల ఏళ్లలో మానవ జాతి యావత్తును నాశనం చేసే వ్యాధి ప్రబలే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు