NTR : నా భార్య బర్త్‌డే వదిలేసి చరణ్ కోసం వెళ్ళేవాడిని

ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ''చెర్రీ నేను చాలా మంచి ఫ్రెండ్స్‌. చాలా సంవత్సరాల నుంచి మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. భిన్న దృవాలు ఆకర్షిస్తాయి అంటారు కదా, అలా మేమిద్దరం కలిసిపోయాం. ఇప్పుడు....

NTR :  ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మార్చి 25న రిలీజ్‌ కానుంది. ఇప్పటికే అనేక వాయిదాల అనంతరం ఈ సినిమా రిలీజ్ అవుతుంది. దీంతో మరోసారి సినిమా ప్రమోషన్స్ ని భారీగా చేస్తున్నారు చిత్ర యూనిట్. రామ్ చరణ్, రాజమౌళి, ఎన్టీఆర్ కలిసి వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా వీరు ముగ్గుర్ని ప్రముఖ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూ ఆద్యంతం కామెడీగా సాగింది. ఇందులో వీరు ముగ్గురు పలు ఆసక్తికర విషయాలని తెలియచేశారు.

 

ఈ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ”చెర్రీ నేను చాలా మంచి ఫ్రెండ్స్‌. చాలా సంవత్సరాల నుంచి మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. భిన్న దృవాలు ఆకర్షిస్తాయి అంటారు కదా, అలా మేమిద్దరం కలిసిపోయాం. ఇప్పుడు ఈ సినిమా వల్ల మా స్నేహం అందరికి తెలిసింది. మార్చి 26న నా భార్య లక్ష్మీప్రణతి బర్త్‌డే. మార్చి 27న చరణ్‌ బర్త్‌డే. మా ఇద్దరి ఇళ్లు దగ్గరిదగ్గరిగా ఒకే చోట ఉంటాయి. ఎవరికీ తెలియని విషయమేంటంటే.. 26వ తేదీ అర్ధరాత్రి 12 గంటలయ్యిందంటే నేను మా ఇంటి గేటు బయట ఉండేవాడిని, చరణ్‌ కారు రాగానే అందులో ఎక్కేసి వెళ్లిపోయేవాడిని. ప్రణతి ఫోన్‌ చేసి ‘నా బర్త్‌డే, నువ్వెక్కడున్నావ్‌?’ అంటే పన్నెండు దాటింది ఇవాళ 27 నీ బర్త్‌డే అయిపోయింది అని చెప్పేవాడిని చరణ్ కోసం” అంటూ తెలిపారు.

RRR : అమెరికాలో భారీగా ‘ఆర్ఆర్ఆర్’.. 1150 పైగా థియేటర్స్‌లో..

దీనిపై చరణ్ మాట్లాడుతూ.. అలా చాలా పుట్టినరోజులు తారక్ తోనే సెలబ్రేట్ చేసుకున్నాను అని తెలిపారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా వీరిద్దరి స్నేహం తెలుసుకున్న అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు