Prabhas – NTR : సలార్ 2 ఇప్పట్లో లేనట్టే.. ఎన్టీఆర్ సినిమాతో ప్రభాస్ ఫ్యాన్స్ కు నిరాశ..

నేడు అనౌన్స్ చేసిన ఎన్టీఆర్ సినిమాతో ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.

Prabhas – NTR : ప్రభాస్ బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ మళ్ళీ ఇటీవల సలార్ సినిమాతోనే సాధించాడు. సలార్ సినిమాలో ప్రభాస్ ని ఓ రేంజ్ మాస్ గా చూపించి ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేసాడు ప్రశాంత్ నీల్. సలార్(Salaar) కి పార్ట్ 2 కూడా ఉంది. సలార్ సినిమా చివర్లో పార్ట్ 2 కి తగ్గ హైప్ కూడా ఇచ్చారు. దీంతో ప్రభాస్ అభిమానులంతా సలార్ 2 ఎప్పుడు మొదలుపెడతారా, ఎప్పుడు వస్తుందా ఆ సినిమా అని ఎదురుచూస్తున్నారు.

అయితే ప్రభాస్ అభిమానులకు నిరాశ తప్పేలా లేదు. నేడు అనౌన్స్ చేసిన ఎన్టీఆర్ సినిమాతో ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఎన్టీఆర్ గతంలో ప్రశాంత్ నీల్(Prashanth Neel) తో సినిమా ప్రకటించాడు. తాజాగా నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా ఆగస్టు నుంచి షూటింగ్ మొదలుపెట్టబోతున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించారు. ఇన్ని రోజులు ప్రశాంత్ నీల్ సలార్ 2పై వర్క్ చేస్తున్నాడు అనుకున్నారు అంతా. కానీ ఎన్టీఆర్ సినిమా వర్క్ చేస్తున్నట్టు ఈ ప్రకటనతో క్లారిటీ వచ్చేసింది.

Also Read : NTR – Prasanth Neel : ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా అప్డేట్ వచ్చేసింది.. షూటింగ్ ఎప్పుడంటే..?

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నట్టు సమాచారం. ఆగస్టులో షూటింగ్ మొదలుపెట్టి 2025 లేదా 2026లో ఈ సినిమాని రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. దీంతో ఈ సినిమా అయ్యాకే సలార్ 2 ఉంటుంది అని అర్ధమవుతుంది. కాకపోతే సలార్ 2 సినిమాకు ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయింది, డైరెక్ట్ షూట్ కి వెళ్లడమే. ఈ లెక్కన సలార్ 2 సినిమా రావాలంటే ఇంకో రెండేళ్లు పడుతుందని క్లియర్ గా అర్ధమవుతుంది. దీంతో సలార్ మ్యాజిక్ ని తెరపై ఇప్పట్లో చూడలేమని ప్రభాస్ అభిమానులు నిరాశ చెందుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు