DH Srinivas: ఏ క్షణంలోనైనా భారత్‌లోకి ఒమిక్రాన్ రావచ్చు.. తస్మాత్ జాగ్రత్త!

ప్రపంచానికి కునుకులేకుండా చేస్తున్న కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు

DH Srinivas: ప్రపంచానికి కునుకులేకుండా చేస్తున్న కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్ డీహెచ్‌ శ్రీనివాస్‌. అయితే, ప్రజలు మాత్రం ఈ వేరియంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు శ్రీనివాస్. ఒమిక్రాన్ ఏ క్షణంలోనైనా భారత్‌లోకి రావొచ్చునని అన్నారు.

రిస్క్ దేశాల నుంచి వచ్చేవారి విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వహించకుండా.. టెస్టింగ్, ట్రేసింగ్ చేస్తున్నామని, యూకే, సింగపూర్ నుంచి వచ్చిన 325మంది ప్రయాణికులకు ఇప్పటికే టెస్ట్ చేశామని, అందులో ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు చెప్పారు శ్రీనివాస్. అతన్ని ఇప్పుడు టిమ్స్‌లో అడ్మిట్ చేశామని చెప్పారు. రిపొర్ట్ జీనోమ్‌కు పంపామని, ఒమిక్రాన్ నా? కాదా? అనేది రిపొర్ట్ ఆధారంగా తేలుతుందన్నారు.

ఒమిక్రాన్ త్వరలో రాబోతుందని, ముప్పుగా మారొద్దు అంటే జాగ్రతలు పాటించాలన్నారు శ్రీనివాస్. ఒమిక్రాన్‌పై సిఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారని కూడా చెప్పారు. వ్యాక్సినేషన్ తక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో మూడు రోజుల్లో మూడు దేశాల నుంచి 24 దేశాలకు వ్యాప్తి చెందిందని, వ్యాక్సిన్ తీసుకొని ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు శ్రీనివాసరావు.

ట్రెండింగ్ వార్తలు