Love Jihad in Karnataka: కర్ణాటకలో మరో లవ్ జిహాద్ ఘటన: వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య

మత మార్పిడి చేసుకోవాలంటూ ప్రియుడు వేధింపులు తట్టుకోలేక మానసిక క్షోభకు గురైన ఓ యువతి చివరకు బలవన్మరణానికి పాల్పడింది.

Love Jihad in Karnataka: కర్ణాటక రాష్ట్రంలో మరోమారు లవ్ జిహాద్ ఘటన కలకలం రేపింది. మత మార్పిడి చేసుకోవాలంటూ ప్రియుడు వేధింపులు తట్టుకోలేక మానసిక క్షోభకు గురైన ఓ యువతి చివరకు బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు, స్థానిక మీడియా కధనం ప్రకారం.. ఉడుపి జిల్లా కుందాపూర్ పట్టణ సమీపంలోని ఉప్పినకుడ్రు గ్రామానికి చెందిన..శిల్పా దేవాడిగ(25) అనే యువతి..స్థానికంగా ఓ బట్టల దుకాణంలో పనిచేస్తుండేది. ఈక్రమంలో మూడేళ్ళ క్రితం అజిజ్ అనే యువకుడు శిల్పతో పరిచయం పెంచుకుని, ఆమెను తన దారికి తెచ్చుకున్నాడు. అజిజ్ మాటలు నమ్మిన శిల్ప..తన కుటుంబ సభ్యులను కాదని అతనితో వెళ్లిపోయింది. అజిజ్, శిల్పను శారీరకంగా లొంగదీసుకున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా శిల్ప పెళ్లి ప్రస్తావన తీసుకురాగా..అజిజ్ మాట దాటేస్తున్నాడు. ఇస్లాం మతంలోకి మారితేనే పెళ్లి చేసుకుంటానని లేకపోతే నగ్న చిత్రాలు బయటపెట్టి పరువు తీస్తానంటూ అజిజ్ శిల్పను వేధించసాగాడు.

other stories: Accident In Ladakh : లద్ధాఖ్ ఘోర ప్రమాదం..నదిలో పడ్డ ఆర్మీ వాహనం..ఏడుగురు జవాన్లు దుర్మరణం..

దీంతో ఎంతో మానసిక క్షోభకు గురైన శిల్ప.. బుధవారం విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై శిల్ప కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు అందుకున్న కుందాపూర్ పోలీసులు..శిల్ప, అజిజ్ నివాసమున్న ఇంటిని పరిశీలించి ఆత్మహత్యకు ముందు యువతీ రాసిన లేఖను కనుగొన్నారు. తాను ఎంతలా మోసపోయింది, సొంత కుటుంబ సభ్యులను కాదని అజిజ్ లాంటి దుర్మార్గుడికి దగ్గరవడం ఎంత క్షోభకు గురిచేసిందో ఆ లేఖలో వివరించింది శిల్ప. శిల్ప మృతి పై ఆమె సోదరుడు రాఘవేంద్ర స్పందిస్తూ..అజిజ్ కు గతంలోనే పెళ్లయిందని, అయినా తమ సోదరిపై వలపన్ని పధకం ప్రకారమే ఆమెను లొంగదీసుకున్నాడని అన్నారు.

other stories: Indian Soldiers: మంచు బొరియల్లో నిండా మునిగిపోయిన సైనికులు: దేశ రక్షణలో ప్రాణాలు పణంగా పెడుతున్న సైనికులు

అజిజ్ చెప్పే మాయమాటలు నమ్మిన శిల్ప అతని చేతిలో బలైపోయిందని రాఘవేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ సోదరి నగ్న చిత్రాలు తీసిన అజిజ్, వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ ఆమెను వేధించడం ప్రారంబించాడని..ఈక్రమంలో శిల్ప పేరును కూడా సల్మా అజీజ్ గా మార్చిన అజిజ్..ఆమెను మత మార్పిడి చేసుకోవాలంటూ ఒత్తిడి తెచ్చాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రాఘవేంద్ర పేర్కొన్నారు. నిందితుడు అజిజ్ పరారీలో ఉండగా పోలీసులు గాలిస్తున్నారు. కాగా కొన్ని రోజుల క్రితం కర్ణాటకలోని కలబురగిలోనూ లవ్ జిహాద్ ఘటన వెలుగు చూసింది. లవ్ జిహాద్ పై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన కర్ణాటక ప్రభుత్వం.. ఆమేరకు లవ్ జిహాద్ నిరోధక చట్టాన్ని తెచ్చే యోచనలో ఉంది.

ట్రెండింగ్ వార్తలు