Oppo 2023 Flagship Phones : 2023 ఒప్పో ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో రానున్న 4 కీలక ఆండ్రాయిడ్ అప్‌డేట్స్.. ఏయే ఫోన్లలో రానుందంటే? మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి..!

Oppo 2023 Flagship Phones : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో (Oppo) నుంచి 2023 ఏడాదికి ఎంపిక చేసిన మోడల్‌లకు 4 సంవత్సరాల మేజర్ ColorOS అప్‌డేట్‌లను అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

Oppo 2023 Flagship Phones : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో (Oppo) నుంచి 2023 ఏడాదికి ఎంపిక చేసిన మోడల్‌లకు 4 సంవత్సరాల మేజర్ ColorOS అప్‌డేట్‌లను అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. 2023లో ఎంపిక చేసిన ఫ్లాగ్‌షిప్ మోడల్‌లకు ఐదేళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందించనున్నట్లు ఒప్పో వెల్లడించింది. అయితే ఆ హ్యాండ్‌సెట్ల పేర్లు ఇంకా రివీల్ చేయలేదు. Oppo ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో ColorOS ఆపరేటింగ్ సిస్టమ్ దాని హిస్టరీలో గత వెర్షన్ కన్నా వేగవంతంగా పనిచేస్తుందని ప్రకటించింది.

ColorOS 13 అనేది ఆండ్రాయిడ్ 13 ఆధారంగా కంపెనీ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్.. ఆగస్టు 18, 2022న రిలీజ్ అయింది. అప్పటినుంచి ColorOS 13 ప్రపంచవ్యాప్తంగా 33 స్మార్ట్‌ఫోన్ మోడళ్లకు అందుబాటులోకి వచ్చింది. ColorOS హిస్టరీలో అత్యంత వేగవంతమైన అతిపెద్ద అప్‌డేట్‌గా నిలిచిందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

అధికారిక రిలీజ్ తర్వాత అదే నాలుగు నెలల వ్యవధిలో, ColorOS 12 (అక్టోబర్ 11, 2021 నుంచి ఫిబ్రవరి 11, 2022 వరకు డేటా)తో పోలిస్తే 50శాతం ఎక్కువ హ్యాండ్‌సెట్ మోడల్‌లు ColorOS 13 (ఆగస్టు 18 నుంచి డిసెంబర్ 18, 2022 వరకు డేటా)కి సపోర్టు చేసేలా ఉన్నాయని కంపెనీ తెలిపింది.

Oppo 2023 Flagship Phones _ Oppo announces four major Android updates for 2023 flagship phones

Read Also : Oppo Reno 8 Pro Sale : ఒప్పో రెనో 8 ప్రో 5G ఫోన్ స్పెషల్ ఎడిషన్ సేల్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

సరికొత్త ఆక్వామార్ఫిక్ డిజైన్‌తో వస్తున్న ColorOS 13 స్మార్ట్ AOD, మల్టీ-స్క్రీన్ కనెక్ట్, హోమ్ స్క్రీన్ మేనేజ్‌మెంట్ వంటి ఆకట్టుకునే ఫీచర్లను కలిగి ఉన్నాయి. ప్రపంచ వినియోగదారులకు యూజర్ ఫ్రెండ్లీ ఎక్స్ పీరియన్స్ అందిస్తాయి. యానిమేటెడ్ ఎఫెక్ట్‌లు, ఎల్లప్పుడూ డిస్‌ప్లేలో ఆకర్షణీయంగా ఉంటాయి.

Spotify కోసం ప్రత్యేక ప్లేబ్యాక్ కంట్రోల్ ColorOS 13 అప్‌డేట్‌తో వస్తున్న ఇతర ఫీచర్లు ఉన్నాయి. Oppo లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ వెర్షన్‌తో యూజర్ ప్రైవసీ, సెక్యూరిటీపై దృష్టి సారిస్తోందని పేర్కొంది. Windows డివైజ్‌‌లు, Oppo Air టాబ్లెట్‌తో క్రాస్-డివైస్ సహకారాన్ని అందిస్తుందని Oppo తెలిపింది.

ఈ నెల ప్రారంభంలో డిసెంబర్ నెలలో ColorOS 13 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కంపెనీ ప్రకటించింది. ఈ అప్‌‌డేట్ అందిన ఒప్పో ఫోన్ల జాబితాలో Oppo F21 Pro, Oppo K10 5G, Oppo K10, Oppo A96, Oppo A77, Oppo A76 వంటి స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. కొన్ని ఒప్పో డివైజ్‌లు మాత్రం ఇంకా కొత్త అప్‌డేట్‌ని అందుకోలేదు. వీటిలో ఫ్రాన్స్‌లోని Oppo Find X3 Neo కూడా ఉంది.

త్వరలోనే కొత్త అప్‌డేట్ పొందవచ్చని భావిస్తున్నారు. Oppo Reno6 Z (థాయ్‌లాండ్), Oppo Reno5 Pro 5G (భారత్, పాకిస్తాన్), Oppo Reno5 Z (UAE), Oppo F19 Pro+ 5G (భారత్) డిసెంబర్ 28 నుంచి అప్‌డేట్‌ను అందుకోనున్నాయి. Oppo Find X5 Lite (ఫ్రాన్స్), Oppo A74 5G (ఇండియా, ఇండోనేషియా) డిసెంబర్ 29 నుంచి కొత్త అప్‌డేట్‌ను అందుకోనున్నాయి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Oppo Inno Day 2022 : ఒప్పో ఫైండ్ N2 ఫోల్డబుల్ ఫోన్ వస్తోంది.. లాంచ్ డేట్ ఎప్పుడు? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

ట్రెండింగ్ వార్తలు