Opposition Meeting : బెంగళూరు వేదికగా విపక్షాల భేటీ… పాల్గొననున్న 24 పార్టీలు

మోదీ సర్కార్ ను గద్దే దించడమే లక్ష్యంగా పోరాడేందుకు విపక్షాలు ఏకమవుతున్నాయి. ఇందుకోసం ఐక్యంగా పోరాడేందుకు నిర్ణయించిన నేతలు ఎన్నికల కార్యాచరణ, పొత్తులపై చర్చించేందుకు మిత్ర పక్షాలతో కలిసి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.

Opposition meeting

Opposition Parties Participate : దేశవ్యాప్తంగా అప్పుడే సార్వత్రిక ఎన్నికల సందడి నెలకొంది. వచ్చే ఎన్నికల్లో మరోసారి ఘన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉండగా, బీజేపీని ఎలాగైనా గద్దె దింపాలనే పట్టుదలతో విపక్షాలు కలిసి కట్టుగా ముందుకు సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ (మంగళవారం) బెంగళూరులో విపక్ష నేతలు సమావేశం అవుతున్నారు. మహా ఘట్ బంధన్ పేరుతో విపక్షాలకు చెందిన పలు పార్టీలు ఒకే గొడుకు కిందకు వస్తున్నాయి.

మోదీ సర్కార్ ను గద్దే దించడమే లక్ష్యంగా పోరాడేందుకు విపక్షాలు ఏకమవుతున్నాయి.
ఇందుకోసం ఐక్యంగా పోరాడేందుకు నిర్ణయించిన నేతలు ఎన్నికల కార్యాచరణ, పొత్తులపై చర్చించేందుకు మిత్ర పక్షాలతో కలిసి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే బెంగళూరు డిన్నర్ మీటింగ్ లో పాల్గొన్న నేతలు ఇవాళ మరోసారి సమావేశమై వివిధ అంశాలపై చర్చించనున్నారు.

Former Kerala Chief Minister : కేరళ మాజీ ముఖ్యమంత్రి ఒమెన్ చాందీ కన్నుమూత

బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్ వేదికగా జరిగిన సమావేశాల్లో 26 పార్టీల నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతోపాటు లాలూ ప్రసాద్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ హాజరయ్యారు. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇవాళ (మంగళవారం) ఉదయం 11 గంటల నుంచి మళ్లీ సమావేశం కొనసాగనుంది.

కనీస ఉమ్మడి కార్యక్రమానికి ఉప సంఘం ఏర్పాటు చేయడం, రాష్ట్రాల వారిగా సీట్ల సర్దుబాటు అంశం, కూటమి పేరు వంటివి ఈ సమావేశంలో నిర్ణయిస్తారని తెలుస్తోంది. పాట్నా సమావేశం విజయవంతం కావడంతో బెంగళూరు భేటీని కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రతిపక్ష కూటమి ఎజెండాను చర్చించడానికి ఈ సమావేశం వేదిక కానుంది.

Small Plane Crash : పోలాండులో కుప్పకూలిన చిన్న విమానం..ఐదుగురి మృతి

2024 ఎన్నికల కోసం కూటమిని నడిపించడానికి ఓ సబ్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. కూటమికి కొత్త పేరును సూచించే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రతిపక్ష కూటమికి ఏం పేరు పెట్టనున్నారనే అంశం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నిన్నటి (సోమవారం) సమావేశానికి హాజరుకాలేకపోయిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నేటి (మంగళవారం) భేటీకి హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. తన కూతురు సుప్రియా సూలేతో కలిసి ఆయన విపక్షాల భేటీలో పాల్గొనబోతున్నారు.

ట్రెండింగ్ వార్తలు