Paddy Issue: కేంద్రం వర్సెస్ రాష్ట్రం.. @ధాన్యం వివాదం

ధాన్యం వివాదంలో కేంద్రం.. రాష్ట్రాల మధ్య వాదన ముదిరింది. సేకరణ అంశంలో జరిగిన జాప్యంపై ఒకరిపై మరొకరు తప్పు తోసిపుచ్చుకుంటూ ఆరోపణలకు దిగారు. ధాన్యం నిల్వలు పేరుకుపోవడానికి పరస్పర ఆరోపణలు చేసుకుంటూ రచ్ఛ చేస్తున్నారు.

 

 

Paddy Issue: ధాన్యం వివాదంలో కేంద్రం.. రాష్ట్రాల మధ్య వాదన ముదిరింది. సేకరణ అంశంలో జరిగిన జాప్యంపై ఒకరిపై మరొకరు తప్పు తోసిపుచ్చుకుంటూ ఆరోపణలకు దిగారు. ధాన్యం నిల్వలు పేరుకుపోవడానికి పరస్పర ఆరోపణలు చేసుకుంటూ రచ్ఛ చేస్తున్నారు.

ఇప్పటివరకూ ధాన్యం సేకరణ చేయలేదని రాష్ర్ట ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపణలకు దిగింది.

తెలంగాణా ప్రభుత్వ అలసత్యం, నిర్లక్ష్యం కారణంగానే ప్రస్తుత పరిస్థితికి దారితీసిందని కేంద్రంపై దుమ్మెత్తిపోసింది. ఆరోపణలను తోసిపుచ్చుతూ.. అవకతవకలకు పాల్పడిన మిల్లర్లపై రాష్ర్ట ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదంటూ కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Read Also: ధాన్యం కొనుగోలుపై కేంద్రానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నిరసనలు: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన

ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద పేదలకు పంచాల్సిన బియ్యం కూడా పంచడం లేదంటూ కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ఫిర్యాదులు చేసింది. చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి కూడా మాట విస్మరిస్తుందని పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వ వైఖరి కారణంగానే ధాన్యం సేకరణ నిలిచిపోయిందంటూ వ్యాఖ్యానించింది.

ట్రెండింగ్ వార్తలు