Election Commission: షెడ్యూల్ ప్రకారమే ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. ఈసీ ప్రకటన!

లక్నోలో విలేకరుల సమావేశం నిర్వహించింది ఎన్నికల సంఘం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు సకాలంలో ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాయని ఎన్నికల సంఘం వెల్లడించింది.

Election Commission: లక్నోలో విలేకరుల సమావేశం నిర్వహించింది ఎన్నికల సంఘం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు సకాలంలో ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాయని ఎన్నికల సంఘం వెల్లడించింది.

కొన్ని రాజకీయ పార్టీలు ఎక్కువ ర్యాలీలను వ్యతిరేకిస్తుండగా.. జనవరి 5వ తేదీ రాష్ట్రంలో తుది ఓటర్ల జాబితా రానుండగా.. తర్వాతే ఎన్నికల తేదీలను ప్రకటిస్తారు. ఓటింగ్‌ సమయాన్ని గంటపాటు పెంచుతూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. పోలింగ్ రోజున ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగబోతుంది.

జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బూత్‌లను ఏర్పాటు చేయడాన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని కమిషన్ చెప్పింది. యూపీలో ఈసారి 52 శాతం కొత్త ఓటర్లు ఉన్నారని ఎన్నికల సంఘం తెలిపింది. జనవరి 5వ తేదీన తుది ఓటర్ల జాబితా రానుండగా.. అన్నీ ఓటింగ్‌ బూత్‌ల వద్ద వీవీప్యాట్‌ యంత్రాలను ఏర్పాటు చేస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ వెల్లడించారు.

ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించడానికి, దాదాపు లక్ష ఓటింగ్ బూత్‌లలో ప్రత్యక్ష వెబ్‌కాస్టింగ్ సౌకర్యం అందుబాటులోకి తీసుకుని రానున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం ఓటర్ల సంఖ్య 15 కోట్లకుపైగా ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత అసలు ఓటర్ల గణాంకాలు తెలుస్తాయని ఎన్నికల సంఘం తెలిపింది.

అయితే, షెడ్యూల్ సమయానికే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నట్లు ఎన్నికల సంఘం చెప్పింది. షెడ్యూలు ప్రకారమే ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో కేంద్ర ఎన్నికల సంఘం మూడు రోజుల పర్యటన ముగిసింది.

స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో కోవిడ్ ప్రోట్‌కాల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని అన్ని పార్టీలు కోరాయని చెబుతున్నారు. వచ్చే వారమే ఎన్నికల షెడ్యూల్ ప్రకటన చేయనున్నారు.

ట్రెండింగ్ వార్తలు