Bro Trailer : బ్రో ట్రైలర్‌కి టైం ఫిక్స్ అయ్యింది.. గెట్ రెడీ పవన్ ఫ్యాన్స్..!

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మెగా మల్టీస్టారర్ మూవీ బ్రో ట్రైలర్ రిలీజ్ కి టైం ఫిక్స్ అయ్యింది.

Pawan Kalyan Sai Dharam Tej Bro Movie Trailer release date and time

Bro Trailer : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ మూవీ ‘బ్రో’. తమిళ్ నటుడు మరియు దర్శకుడు సముద్రఖని ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే టీజర్ అండ్ సాంగ్స్ ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలతో సందడి చేస్తున్న మూవీ టీం.. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ కి టైం ఫిక్స్ చేశారు.

Sai Dharam Tej : అరసవల్లి సూర్యనారాయణ ఆలయంలో సాయిదరమ్ తేజ్ ప్రత్యేక పూజలు..

ఈ మూవీ ట్రైలర్ ని రేపు జులై 22న సాయంత్రం 6:03 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. టీజర్ తోనే ఒక రేంజ్ హైప్ క్రియేట్ చేసిన మేకర్స్.. ఇప్పుడు ట్రైలర్ తో ఎటువంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి. కాగా ఈ సినిమా తమిళంలో హిట్ అయిన వినోదయ సిత్తంకి రీమేక్ గా వస్తుంది. ఆ మూవీ నుంచి కేవలం స్టోరీ లైన్ మాత్రమే తీసుకోని ఈ సినిమాలో చాలా మార్పులు చేసినట్లు సాయి ధరమ్ తేజ్ తెలియజేశాడు. ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించాడు.

Bholaa Shankar : మిల్కీ బ్యూటీతో చిరు డేటింగ్ పార్టీ.. మెలోడీ సాంగ్ అదిరిపోయింది..


గోపాల గోపాల సినిమాలో పవన్ మోడరన్ దేవుడిగా కనిపించి ఆడియన్స్ థ్రిల్ ఫీల్ అయ్యేలా చేశాడు. ఇప్పుడు ఈ చిత్రంలో కూడా టైం గాడ్ గా కనిపించబోతున్నాడు. గోపాల గోపాలలో పవన్ పాత్ర సెకండ్ నుంచి వస్తుంది. కానీ ఈ సినిమాలో మొదటి 15 నిముషాలు మాత్రమే పవన్ ఉండడు. మిగితా సినిమా మొత్తం పవన్ కనిపిస్తాడు. ఇక కేతిక శర్మ తేజ్ కి జోడిగా కనిపిస్తుంటే ప్రియా ప్రకాష్ వారియర్ తేజ్ కి చెల్లి పాత్రలో నటిస్తుంది. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ నెల 28న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

 

 

ట్రెండింగ్ వార్తలు