Pawan Kalyan : ఎన్నికల్లో నెగ్గిన దిల్ రాజుకి జనసేన పవన్ కళ్యాణ్ అభినందనలు..

ఎన్నికలో నెగ్గి అధ్యక్షుడి పదవి చేపట్టిన దిల్ రాజుకి జనసేన పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు.

Pawan Kalyan wishes to star producer Dil Raju TFCC Elections

Pawan Kalyan – Dil Raju : ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారికి జరిగే టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ ఎలక్షన్స్ ఈ ఏడాది హోరాహోరీగా జరిగాయి. ఈ ఎన్నికల్లో ప్రస్తుత స్టార్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజ్ ప్యానెల్, ఒకప్పటి స్టార్ ప్రొడ్యూసర్స్ అయిన సి కళ్యాణ్ ప్యానల్ మధ్య పోటీ జరిగింది. ఇక ఈ ఎన్నికల్లో దిల్ రాజు ప్యానల్ సూపర్ మెజారిటీతో గెలుపుని సొంతం చేసుకున్నారు. నిన్న జులై 31న ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా ‘దిల్ రాజు’, సెక్రటరీగా ‘దామోదర్ ప్రసాద్’ లతో పాటు ఇతర మెంబెర్స్ కూడా తమ పదవిని చేపట్టారు.

Karthi : 96 దర్శకుడితో కార్తీ సినిమా.. నేషనల్ అవార్డు విన్నెర్స్ నిర్మాత అండ్ కెమెరా మ్యాన్..

ఇక దిల్ రాజు అధ్యక్షుడి పదవి చేపట్టడంతో ప్రత్యర్థి సి కళ్యాణ్ నుంచి సినీ వర్గంలోని ప్రముఖులంతా అభినందనలు తెలియజేస్తున్నారు. తాజాగా స్టార్ హీరో మరియు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. దిల్ రాజు మరియు ప్యానల్ మెంబెర్స్ కి అభినందనలు తెలియజేస్తూ జనసేన నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు.

“తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి నూతన కార్యవర్గానికి హృదయపూర్వక అభినందనలు. అధ్యక్షులుగా ఎన్నికైన ప్రముఖ నిర్మాత శ్రీ దిల్ రాజుతో పాటు ఇతర కమిటీ సభ్యులు మండలి కార్యకలాపాలను విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తారని నేను ఆకాంక్షిస్తున్నాను. ఒక సినిమా నిర్మితమవుతోందంటే కోట్ల సంపద సృష్టి జరిగి వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలుగుతుంది. తెలుగు సినిమా స్థాయి వాణిజ్యపరంగా రోజురోజుకీ విస్తృతమవుతోంది. కాబట్టి పరిశ్రమ తలెత్తుకొని నిలిచేలా ఫిల్మ్ ఛాంబర్ నూతన కార్యవర్గం పని చేస్తుందని ఆశిస్తున్నాను” అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నాడు.

Sagileti Katha Trailer : ‘సగిలేటి కథ’ ట్రైలర్.. అదిరిపోయింది.. రాయలసీమ కోడి

ఇది ఇలా ఉంటే, నిన్న అధ్యక్షుడిగా పదవి చేపట్టిన వెంటనే.. దిల్ రాజు ఫిల్మ్ ఛాంబర్ సమస్యల పై దృష్టి సారించాడు. ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ ఈసీ మీటింగ్ ఏర్పాటు చేసి సుదీర్ఘ కాల సమస్యల పరిష్కారం దిశగా దిల్ రాజు చర్చ జరిపించారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలు అన్నిటి పై త్వరలోనే యాక్షన్ తీసుకోని తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి, సంక్షేమం వైపుగా చర్యలు తీసుకుంటూ ముందుకు సాగనున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు