Adipurush: విజువల్ పనుల్లో ఆదిపురుష్.. 3డీ కోసం ఫుల్ ఎఫర్ట్!

ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ‘ఆదిపురుష్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Adipurush: ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ‘ఆదిపురుష్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ అయిపొయింది. రామాయణాన్ని ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు. ఇందులో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా కనిపించనున్నారు. ప్రస్తుతం ‘ఆదిపురుష్’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది.

Adipurush: క్రేజీ అప్డేట్.. ప్రభాస్ మరో సినిమాకు సీక్వెల్ సిద్ధం?

భారీ బడ్జెట్, ప్రెస్టీజియస్ పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ పనులకోసం భారీ సమయం పడుతుంది. పురాణ ఇతిహాస కథతో సినిమా కావడంతో ఈ సినిమా చాలా వరకు గ్రీన్‌ మ్యాట్‌పై చిత్రీకరించారట. దీంతో ఇప్పుడు నిర్మాణానంతర కార్యక్రమాలకు చాలా సమయం పడుతోంది. రూ.350 నుండి రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో T సిరీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Adipurush : పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్.. ఎన్ని భాషలు, థియేటర్లో తెలుసా!

ఇదిలా ఉండగానే ఇప్పుడు ఈ సినిమా నుండి ఓ క్రేజీ అప్డేట్ వినిపిస్తుంది. భారతీయ పురాణాలలో అత్యంత ఇష్టపడే ఇతిహాసాలలో ఒకటైన రామాయణం ఆధారంగా రూపొందే ఈ సినిమాను అంతకు మించి అనే లెవెల్ లో విజువల్ ఎఫెక్ట్స్ ఉండనున్నాయని.. సినిమాను కంప్లీట్ 3డీలో విడుదల చేయనున్నారని తెలుస్తుంది. ఇన్ని పనులు ఉన్నాయి కాబట్టే సినిమాను 2023లో విడుదల చేసే ప్లాన్ చేస్తున్నారట.

ట్రెండింగ్ వార్తలు