Salaar : అప్పుడు సాహో.. ఇప్పుడు సలార్.. టీజర్‌లో ఎలివేషన్స్ ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా?

సలార్ టీజర్ లో ప్రభాస్ కి ఎలివేషన్స్ ఇస్తూ కనిపించిన తాత ఎవరో తెలుసా. రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అంతేకాదు ఒక స్టార్ డైరెక్టర్ తండ్రి కూడా..

prabhas salaar actor Tinnu Anand is father of Siddharth Anand

Salaar : రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), ప్రశాంత్ నీల్ కలయికలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సలార్’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కేజీఎఫ్ చిత్రాలు తరువాత ప్రశాంత్ నీల్ ఈ సినిమా తెరకెక్కిస్తుండడంతో ఈ మూవీ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ టీజర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. కేజీఎఫ్ లో రాకీ భాయ్ ని కన్నడ నటుడు ‘అనంత్ నాగ్’ ఎలివేట్ చేసిన పద్ధతి ఆడియన్స్ కి బాగా నచ్చేసింది. కేజీఎఫ్ తాతగా అనంత్ నాగ్ బాగా ఫేమస్ అయ్యాడు. ఇక ఇప్పుడు సలార్ కోసం ప్రశాంత్ నీల్ మరో కొత్త తాతని రంగంలోకి దించాడు.

Mahesh Babu : మహేష్ ఫ్యామిలీ నుంచి త్వరలో ఇంకో హీరో ఎంట్రీ.. ఎవరో తెలుసా?

బాలీవుడ్ నటుడు ‘టిన్ను ఆనంద్’ (Tinnu Anand) సలార్ లో ప్రభాస్ కి ఎలివేషన్స్ ఇవ్వబోతున్నాడు. “సింహం, చిరుత, పులి, ఏనుగు చాలా డేంజర్. కానీ జురాసిక్ పార్క్‌లో కాదు. ఎందుకంటే అక్కడ ఉండేది డైనోసార్” అంటూ టీజర్ లో ఎలివేషన్స్ ఇస్తూ ప్రభాస్ కంటే ఎక్కువ టిన్ను ఆనంద్ హైలెట్ అయ్యాడు. దీంతో ఈ తాతని అంతకుముందు కూడా ఏదో సినిమాలో చూశాము అంటూ కొందరు నెటిజెన్స్ నెట్టింట తెగ వెతికేస్తున్నారు. గతంలో ప్రభాస్ సినిమాలోనే ఈ తాత కనిపించాడు. సాహూ సినిమాలో ఈ తాత సీనియర్ డాన్ గా కనిపించాడు.

NTR : కొత్త యాప్.. ‘థ్రెడ్స్’లోకి ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ టాలీవుడ్ హీరో ఎన్టీఆర్..

ఈ సినిమా కంటే ముందు తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ సినిమాలో కూడా నటించాడు. చిరంజీవి ‘అంజి’ మూవీలో ఆత్మలింగం కోసం వెతికే మెయిన్ విలన్ పాత్రలో కనిపించగా, బాలకృష్ణ టైం ట్రావెల్ మూవీ ‘ఆదిత్య 369’ లో టైం మెషీన్ కనిపెట్టే సైంటిస్ట్ పాత్రలో నటించాడు. టిన్ను ఆనంద్ నటుడు మాత్రమే కాదు రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా. ఇక ఈయన కుమారుడు సిద్దార్థ్ ఆనంద్ బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. బ్యాంగ్ బ్యాంగ్, వార్, పఠాన్ సినిమాలతో హిందీ బాక్స్ ఆఫీస్ కి బ్లాక్ బస్టర్స్ అందించాడు.

 

ట్రెండింగ్ వార్తలు