National Politics: 6 రోజుల వ్యవధిలో బీజేపీ నుంచి సొంతగూటికే చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ కండువా కప్పుకున్న పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే.. కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే తిరిగి సొంతగూటికి చేరుకున్నారు

National Politics: కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ కండువా కప్పుకున్న పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. పంజాబ్ లోని శ్రీ హరగోవింద్‌పూర్ అసెంబ్లీ నియోజకవరగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే బల్వీందర్ సింగ్ లడ్డీ, డిసెంబర్ 28న కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెఖావత్ సమక్షంలో భారతీయ జనతాపార్టీలో చేరారు. ఆయనతో పాటుగా ఖాదియన్ ఎమ్మెల్యే ఫతే జంగ్ సింగ్ బజ్వా సైతం బీజేపీలో చేరారు. అయితే బీజేపీని వీడిన వీరు తిరిగి ఆరు రోజుల వ్యవధిలోనే సొంతపార్టీ కాంగ్రెస్ వచ్చి చేరారు. ఫతే జంగ్ సింగ్ బజ్వాకు నమ్మకస్తుడిగా చెప్పబడే లడ్డీ, 2017లో శిరోమణి అకాలీదళ్ (SAD) మంజిత్ సింగ్ మన్నా మియాన్‌వింద్‌ను ఓడించి శ్రీ హరగోవింద్‌పూర్ స్థానంలో గెలుపొందారు.

Read: Viral News:15 నిముషాల తేడాతో ఏడాది దాటేసిన కవలలు

మరికొన్ని రోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీ జంపింగ్ లపై అన్ని ప్రధాన పార్టీలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఈక్రమంలో ఎన్నికల ముందు బీజేపీలో చేరిన సీనియర్ నాయకులను వదులుకునేందుకు పంజాబ్ కాంగ్రెస్ సిద్ధంగా లేదు. దీంతో రంగంలోకి దిగిన పార్టీ పెద్దలు బల్వీందర్ సింగ్ లడ్డీ, ఫతే జంగ్ సింగ్ బజ్వాను తిరిగి పార్టీలోకి రావాలంటూ ఒత్తిడి చేశారు. ఈమేరకు ఏఐసీసీ పంజాబ్ వ్యవహారాల ఇంచార్జి హరీష్ చౌదరి వీరిద్దరిని బుజ్జగించి..సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ సమక్షంలో తిరిగి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు.

Also read: Corona: ఫ్రాన్స్ లో బయటపడ్డ మరో కొత్త వేరియంట్

ట్రెండింగ్ వార్తలు