Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో తొలిసారి బ్లాక్ జాకెట్ ధరించిన రాహుల్..

దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల్లో చలితీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో భారత్ జోడో యాత్ర సాగిన సమయంలోనూ రాహుల్ కేవలం తెల్ల టీ-షర్ట్‌నే ధరించారు. తెల్లవారు జామున 6గంటలకు ఎముకలు కొరికే చలినిసైతం లెక్కచేయకుండా రాహుల్ తెల్లటీషర్ట్‌పైనే పాదయాత్రలో పాల్గొన్నారు. దీంతో దేశవ్యాప్తంగా రాహుల్ తెల్ల టీ-షర్ట్‌పై చర్చ జరిగింది. రాహుల్ మీకు చలివేయడం లేదా? అనే ప్రశ్నలు మీడియాతోసహా సామాన్య ప్రజలనుంచి ఎదురయ్యాయి.

Bharat Jodo Yatra: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర చివరి దశకు చేరుకుంది. జనవరి 30న శ్రీనగర్‌లో భారీ ర్యాలీతో ఆయన యాత్రను ముగించనున్నారు. జమ్మూ కశ్మీర్‌లోని కథువాలో శుక్రవారం భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. ఈ ప్రాంతంలో వర్షాలు కుుస్తున్నాయి. చిరుజల్లుల్లోనూ రాహుల్ గాంధీ తన పాదయాత్రను కొనసాగించారు. ఈ క్రమంలో వర్షంకు రక్షణగా రాహుల్ నల్ల రెయిన్ జాకెట్ ధరించి కనిపించారు. యాత్ర ప్రారంభం నుంచి తెల్ల టీషర్ట్‌తోనే కనిపిస్తున్న రాహుల్.. తొలిసారి నల్ల జాకెట్ ధరించారు. దీనిపై పలువురు బీజేపీ నేతలు రాహుల్ కు ప్రశ్నలు సంధిస్తున్నారు.

Bharat Jodo Yatra: జమ్మూకశ్మీర్ చేరుకున్న భారత్ జోడో యాత్ర.. ఎక్కడ, ఎప్పుడు ముగియనుందంటే?

Rahul Gandhi Bharat Jodo Yatra

శుక్రవారం భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ కతువాలోని హత్లీ మోడ్ నుంచి జమ్మూలోని చద్వాల్ వరకు సుమారు 23 కిలో మీటర్లు పాదయాత్ర చేయనున్నారు. రాత్రి సమయంలో చద్వాలలో బస చేస్తారు. సెప్టెంబర్ 7న తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. 10 రాష్ట్రాల్లో 52కంటే ఎక్కువ జిల్లాల్లో రాహుల్ పాదయాత్రలో పాల్గొన్నారు. యాత్ర సమయంలో ఎక్కడా కూడా రాహుల్ గాంధీ తెల్ల టీషర్ట్ మినహా మరేదీ ధరించలేదు.

Bharat Jodo Yatra: జమ్మూ కశ్మీర్‭లోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర.. నెక్ట్స్ ఏంటి?

Rahul Gandhi Bharat Jodo Yatra

దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల్లో చలితీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో యాత్ర సాగిన సమయంలోనూ తెల్లవారు జామున 6గంటలకు తెల్ల షర్ట్ పైనే రాహుల్ యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ తెల్ల టీషర్ట్ పై దేశవ్యాప్తంగా చర్చసైతం జరిగింది. బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య విమర్శల దాడిసైతం కొనసాగింది. గడ్డకట్టించే చలిలోనూ రాహుల్ గాంధీ కేవలం తెల్ల టీషర్ట్ పైనే భారత్ జోడో యాత్రలో పాల్గొనడంపై మీడియా ప్రశ్నించింది. రైతు, కార్మికుడు, పేద పిల్లలను ఇలా ఎప్పుడైనా అడిగారా? చలి నుంచి రక్షించే వెచ్చని బట్టలు కొనుగోలు చేయలేని వారి గురించి ఎప్పుడైనా ఆలోచించారా అంటూ రాహుల్ ఎదురు ప్రశ్నించారు. నేను వేల కిలోమీటర్లు నడిచా.. కానీ అది ఏమాత్రం పెద్ద విషయం కాదు.. వాస్తవానికి వ్యవసాయం చేసే రైతులు, కూలీలు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు రోజూ చాలాదూరం నడుస్తారని, కష్టపడతారని రాహుల్ చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు