Bihar : యువకుడి పైశాచికత్వం .. ట్రైన్ డోర్ దగ్గర నిలబడి ఎదురుగా వెళ్తున్న ట్రైన్‌లోని ప్రయాణికుల్ని బెల్టుతో కొట్టాడు

ఇటీవల కాలంలో రైళ్లలో కొందరి వికృత చేష్టలు ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తోంది. ఇక వీటికి పరాకాష్ట అన్నట్లు కదులుతున్న రైలు నుంచి ఓ యువకుడు ఎదురుగా వెళ్తున్న రైలులోని ప్యాసింజర్లను బెల్టుతో కొట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు తీవ్రస్ధాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘ వ్యతిరేక పనులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Bihar

Bihar : ఇటీవల కాలంలో కొందరిలో విపరీతమైన మనస్తత్వం బయటపడుతోంది. క్రూయల్‌గా ప్రవర్తిస్తున్నారు. ట్రైన్ తలుపు దగ్గర నిలబడిన ఓ యువకుడు ఎదురుగా వెళ్తున్న ట్రైన్‌లోని ప్యాసింజర్లను బెల్ట్‌తో కొడుతూ పైశాచిక ఆనందం పొందుతున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Delhi Metro : ఢిల్లీ మెట్రోలో యువతుల పోల్ డ్యాన్స్ .. DMRC ఎందుకు పట్టించుకోవట్లేదంటూ నెటిజన్లు ఫైర్

బీహార్‌లో ఓ యువకుడి ప్రయాణికుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వైరల్ అవుతోంది. తను ట్రైన్ తలుపు దగ్గర నిలబడి.. ఎదురుగా వెళ్తున్నట్రైన్‌లో ప్రయాణికులను బెల్ట్‌తో కొట్టడం మొదలుపెట్టాడు. ఈ వీడియోలో మొత్తం ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లుగా కనిపించింది. బెల్ట్‌తో కొడుతున్న యువకుడితో పాటు ఒకరు వీడియో రికార్డ్ చేస్తుండగా.. మరొకరు ఇదంతా గమనిస్తున్నారు. ఈ వీడియో @I_DEV_1993 అనే ట్విట్టర్ ఖాతాలో షేరైంది. వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహావేశాలకు లోనయ్యారు.

Delhi Metro Train : ప్లాట్ ఫామ్ మీదకు వస్తున్న మెట్రో రైలు ముందు దూకి యువకుడు ఆత్మహత్య

‘ఈ వ్యక్తి బెల్ట్‌తో కొట్టడం వల్ల డోర్‌లో కూర్చున్న వ్యక్తి రైలు నుండి పడిపోవచ్చు.. పెద్ద ప్రమాదం జరగవచ్చు.. దయచేసి ఇలాంటి సంఘ వ్యతిరేక వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోండి’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. వీరి ట్వీట్‌పై రైల్వే అధికారులు స్పందించారు. ‘సమాచారం అందించినందుకు ధన్యవాదాలు.. అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నాం’ అంటూ రిప్లై ఇచ్చారు. ఇతరులపై ఇలాంటి అమానుష చర్యలకు పాల్పడాలనే మనస్తత్వం ఉన్న వ్యక్తులతో చాలా ప్రమాదం. మరి ఇతనిపై రైల్వే అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు