Jailer : రజినీకాంత్ జైలర్ మూవీ.. ఆ సినిమాకి ఫ్రీమేక్ అంటా.. ట్రైలర్స్ కూడా దాదాపు సేమ్..

రజినీకాంత్ జైలర్ మూవీ ఆ హాలీవుడ్ మూవీకి ఫ్రీమేక్ అంటా. అంతేకాదు ఆ మూవీ ట్రైలర్ కట్, జైలర్ ట్రైలర్ కట్ కూడా..

Rajinikanth jailer is free make of hollywood nobody movie trolls

Jailer : బీస్ట్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటిస్తున్న చిత్రం ‘జైలర్’(Jailer). స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 200 కోట్ల భారీ బడ్జెట్ తో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కుతుంది. ఆగ‌స్టు 10న ఈ మూవీ తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ కాబోతుంది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ ఇటీవల ట్రైలర్ ని రిలీజ్ చేసింది. ఆ ట్రైలర్ లో రజినీకాంత్.. ఒక రిటైర్డ్ జైలర్ రోల్ లో కనిపించాడు. రిటైర్మెంట్ లైఫ్ ని కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ గా గడుపుతుంటాడు.

OMG2 Trailer : ఓ మై గాడ్ 2 ట్రైలర్ రిలీజ్.. అక్షయ్ శివుడి పాత్ర చేయడం లేదు.. సెన్సార్ బోర్డు ఆదేశం..

అయితే ఇంతలో ఒక సమస్య ఎదురవ్వడంతో.. అప్పటి వరకు తన ఫ్యామిలీకి చూపించని తన యాక్షన్ మోడ్ ని బయటకి తీసి విలన్స్ తో ఒక బీస్ట్ లా పోరాడుతుంటాడు. హీరోలోని ఈ యాంగిల్ చూసి కుటుంబసభ్యులు కూడా ఆశ్చర్యపోతారు. అయితే ఈ స్టోరీని ఎక్కడో చూసినట్లు ఉందని కొంతమంది నెటిజెన్స్ నెట్టింట తెగ వెతికేసి అసలు మూవీని బయటకి తీసుకు వచ్చారు. 2021లో వచ్చిన ‘నోబడి’ (Nobody) అనే హాలీవుడ్ మూవీ స్టోరీ కూడా సేమ్. అంతేకాదు ఆ మూవీ ట్రైలర్ కట్, జైలర్ ట్రైలర్ కట్ కూడా దాదాపు సేమ్ టు సేమ్ ఉండడంతో నెటిజెన్స్ నెట్టింట జైలర్ డైరెక్టర్ నెల్సన్ ని ట్రోల్ చేస్తున్నారు. ఒకసారి మీరు కూడా ఆ రెండు ట్రైలర్స్ చూసేయండి.

Naga Chaitanya : శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుడు జీవితం ఆధారంగా నాగచైతన్య సినిమా.. వేటకెల్లి పాక్ కోస్ట్ గార్డ్‌కి చిక్కి..

కాగా జైలర్ సినిమాలో సౌత్ లోని స్టార్ క్యాస్ట్ మొత్తం కనిపించబోతుంది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shiva Rajkumar), మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్‌ మోహన్ లాల్ (Mohanlal), నాగబాబు, సునీల్, జాకీ ష్రాఫ్, త‌మ‌న్నా (Tamannaah), రమ్య కృష్ణ.. ఇలా చాలామంది స్టార్స్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. అనిరుద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

 

ట్రెండింగ్ వార్తలు