Gurmeet Ram Rahim: కరోనా లక్షణాలతో క్షీణించిన డేరా బాబా ఆరోగ్యం.. రహస్యంగా ఆస్పత్రికి!

Gurmeet Ram Rahim: అత్యాచారం, జర్నలిస్ట్ హత్య కేసుల్లో జైలు జీవితం అనుభవిస్తోన్న డేరా సచ్చా సౌదా సిర్సా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్(Gurmeet Ram Rahim) ఆరోగ్యం క్షీణించడంతో.. PGIMS(పండిట్ భగవత్ దయాల్ శర్మ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్) రోహ్తక్‌లో చేర్పించారు పోలీసులు. సునారియా జైలు నుంచి అంబులెన్స్‌లో పటిష్టమైన భద్రతలో ఆసుపత్రికి రహస్యంగా తీసుకుని వచ్చారు.

గుర్మీత్ రామ్ రహీమ్‌ను బుధవారం సాయంత్రం సునారియా జైలు నుంచి పిజిఐఎంస్‌కు తీసుకువచ్చారు. కరోనా లాంటి లక్షణాలు ఉండగా.. అతని ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆస్పత్రికి తీసుకుని వచ్చినట్లుగా చెబుతున్నారు. అతన్ని తీసుకురావడానికి ముందే PGIMS వద్ద భారీ పోలీసు బలగాన్ని మోహరించారు. రామ్ రహీమ్‌ను సాయంత్రం 6.10 గంటలకు అంబులెన్స్‌లో PGIMSకి తీసుకువచ్చారు.

పోలీసు వాహనాల మధ్యలో అంబులెన్స్‌లో సునారియా జైలు నుండి వయా బైపాస్ PGIMSకి తీసుకువచ్చారు. ఎంఎస్‌ కార్యాలయం వెలుపల నేరుగా అంబులెన్స్‌లు తీసుకున్నారు. అంబులెన్స్ నుంచి దిగిన వెంటనే రామ్‌రాహీమ్‌ను సెక్యూరిటీ సర్కిల్‌లోకి తీసుకెళ్లి ప్రత్యేక వార్డుకు తీసుకెళ్లారు. హర్యానా ప్రభుత్వం రామ్ రహీమ్‌కు పెరోల్ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తోందని ఇటీవలికాలంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు