Rama Rao On Duty: టాలీవుడ్లో కొత్త సినిమాలు, క్రేజీ అండ్ ప్రెస్టీజియస్ సినిమాల రిలీజ్ డేట్స్ అనౌన్స్మెంట్ కంటిన్యూ అవుతుంది. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’, ‘ఎఫ్ 3’, ‘సర్కారు వారి పాట’, ‘భీమ్లా నాయక్’, ‘గని’ సినిమాల విడుదల తేదీలు ఖరారు చేశారు. ఇప్పుడీ లిస్టులోకి మాస్ మహారాజా రవితేజ కూడా వచ్చి చేరాడు.
Tollywood : టాలీవుడ్లో ఫుల్ జోష్.. విడుదలకు క్యూ కడుతున్న పెద్ద సినిమాలు..
రవితేజ హీరోగా.. శరత్ మండవ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎస్ఎల్వీ సినిమాస్ ఎల్ఎల్పీ, ఆర్టీ టీం వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న యూనిక్ యాక్షన్ థ్రిల్లర్.. ‘రామారావు ఆన్ డ్యూటీ’.. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో పాపులర్ యాక్టర్ వేణు తొట్టెంపూడి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.
RRR-DON : ఈవెంట్‌కి పిలిచి ఆ హీరో సినిమా డేట్‌కే ఎసరు పెట్టేశాడా రాజమౌళి!
ఈ సినిమా కోసం రెండు డేట్లను లాక్ చేశారు. మార్చి 25న లేదా ఏప్రిల్ 15న ఈ మూవీని విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. ‘‘మా చిత్రంపై మాకు ప్రేమ అలానే ఇతర చిత్రాలపై అమితమైన గౌరవం కూడా ఉంది. మార్చి 25న ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాను విడుదల చేయాలని అనుకున్నాం. కానీ మారిన పరిస్థితులను బట్టి మా సినిమాను మార్చి 25న లేదా ఏప్రిల్ 15న విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం’’ అని ప్రకటించారు.
Due to the recent developments and for the larger good of the industry, #RamaRaoOnDuty would hit the big screens either on March 25th or April 15th.@RaviTeja_offl @directorsarat @itsdivyanshak @rajisha_vijayan @sathyaDP @SamCSmusic @sahisuresh @Cinemainmygenes @RTTeamWorks pic.twitter.com/xOz8MMaBeI
— SLV Cinemas (@SLVCinemasOffl) February 1, 2022