Prabhas: రెబల్ స్టార్ సినిమాల లైనప్.. సాహో అనాల్సిందే!

ఏ హీరోకైనా.. ఒకటి రెండు మహా అయితే మూడు సినిమాలు లైన్లో ఉంటాయి. కానీ ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి మాత్రం ఆల్రెడీ అనౌన్స్ చేసిన 5 సినిమాలతో పాటు మరో మూడు సినిమాలు లైన్లోకి..

Prabhas: ఏ హీరోకైనా.. ఒకటి రెండు మహా అయితే మూడు సినిమాలు లైన్లో ఉంటాయి. కానీ ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి మాత్రం ఆల్రెడీ అనౌన్స్ చేసిన 5 సినిమాలతో పాటు మరో మూడు సినిమాలు లైన్లోకి రావడానికి రెడీ అవుతున్నాయి. మరి ప్రభాస్ అనఫీషియల్ గా కమిట్ అయిన ఆ మూడు సినిమాలేంటో డీటెయిల్డ్ గా చూద్దాం.

Rashi Khanna: సెగలు రేపే సొగసుతో రాశీ ఖన్నా రచ్చ!

రెండేళ్ల నుంచి ఒక్క సినిమా కూడా రిలీజ్ చెయ్యకుండా ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసిన రెబల్ స్టార్ వరస పెట్టి సినిమాలు అనౌన్స్ చేసి ఫ్యాన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ 5 సినిమాలను లైనప్ చేసి బ్యాక్ టూ బ్యాక్ షూట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలతో పాటు ప్రభాస్ మరో మూడు సినిమాల్ని కూడా లైన్లో పెడుతున్నారు. ప్రస్తుతానికి ప్రభాస్ రాధేశ్యామ్ మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Madalsa Sharma: క్యాస్టింగ్ కౌచ్.. అమ్మాయి ఉందంటే చాలు చుట్టూ..

ఆల్రెడీ నెక్ట్స్ సమ్మర్ రిలీజ్ కు ఎయిమ్ చేసుకుని ఓమ్ రౌత్ తో చేస్తున్న ఆదిపురుష్ సినిమాని ఓ కొలిక్కి తీసుకొచ్చిన ప్రభాస్ సలార్ ని స్పీడప్ చెయ్యడానికి ఇప్పటికే ప్లాన్ చేసుకున్నారు. ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సలార్ సినిమా అవ్వకుండానే నాగాశ్విన్ తో ప్రాజెక్ట్ కె ని ప్లాన్ చేశారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించి ప్రీ ప్రొడక్షన్, అమితాబ్ తో కొంత షూటింగ్ అవ్వగొట్టిన టీమ్.. ఈ ఇయర్ ఎండ్ నుంచి ప్రభాస్ తో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు.

Poonam Kaur: ‘పీకే లవ్’ అంటూ మరోసారి పూనమ్ సంచలనం!

24వ సినిమా అసలు మొదలవ్వకముందే సందీప్ రెడ్డి వంగాతో తన 25వ సినిమా అనౌన్స్ చేశారు. ఆల్రెడీ ఈ 5 సినిమాలతో పాటు ప్రభాస్ మరో మూడు సినిమాల్ని లైనప్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమా చేస్తున్న ప్రభాస్.. మైత్రి మూవీ మేకర్స్ తో మరోసారి ప్రశాంత్ నీల్ ని రిపీట్ చెయ్యబోతున్నారు. అంతేకాదు.. వార్ సినిమాని తెరకెక్కించిన సిద్దార్ద్ ఆనంద్ తో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ కి కూడా ప్లాన్ చేస్తున్నారు.

Regina Cassandra: డస్కీ బ్యూటీ.. ఆస్వాదనకు రెండు కళ్ళూ చాలవేమో!

ఎప్పటినుంచో టాక్ వినిపిస్తున్న బాలీవుడ్ మూవీతో పాటు బాహుబలి లాంటి భారీ సక్సెస్ అందించిన రాజమౌళితో కూడా సినిమా చేసే ఆలోచనలో ఉన్నారు ప్రభాస్. ఈ సినిమాలతో పాటు సాహోతో ప్రభాస్ కి అంత మంచి సక్సెస్ ఇవ్వలేకపోయిన సుజిత్.. ప్రభాస్ తో ఎలా అయినా హిట్ సినిమా తియ్యాలని స్టోరీ రెడీ చేస్తున్నాడు. దీనికి సంబందించి స్టోరీ డిస్కషన్స్ కూడా స్టార్ట్ అయినట్టు టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు