Bollywood : గత కొంతకాలంగా తెలుగు సినిమా, సౌత్ సినిమాలు మంచి విజయాల్ని సాధిస్తున్నాయి. ఇక్కడ మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా భారీ విజయాలు సాధిస్తున్నాయి. ఇంకొంచెం అడుగు ముందుకేసి ఏకంగా బాలీవుడ్ సినిమాల కంటే భారీ విజయాలు సాధిస్తున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే సౌత్ సినిమాలు బాలీవుడ్ ని కూడా శాసించే స్థాయికి ఎదిగాయి. ఇప్పటికే బాలీవుడ్ లోని స్టార్లు దీనిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల సల్మాన్ ఖాన్ సౌత్ సినిమాలు బాలీవుడ్ లో ఆడుతున్నాయి, బాలీవుడ్ సినిమాలు మాత్రం సౌత్ లో ఎందుకు ఆడట్లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక హీరో జాన్ అబ్రహం నేను కేవలం హిందీ సినిమాలు తీస్తాను, వేరే భాషల్లో నటించాను అంటూ తెలుగు సినిమాలని ఉద్దేశించి మాట్లాడాడు. మరో పక్క కన్నడ సినిమా కేజిఎఫ్ 2 రిలీజ్ ఉందని హిందీ స్ట్రయిట్ సినిమా, స్టార్ హీరో షాహిద్ కపూర్ సినిమా ‘జెర్సీ’ని కూడా వాయిదా వేసుకున్నారు. ఇది కూడా తెలుగు సినిమా రీమేక్ కావడం గమనార్హం. ఒక డబ్బింగ్ సినిమాకి బాలీవుడ్ సినిమా వాయిదా వేసుకుంది అంటే సౌత్ సినిమాలు బాలీవుడ్ ని ఏ రేంజ్ లో భయపెడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
RRR : ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్.. చైనా, జపాన్‌తో సహా మరో 30 దేశాల్లో త్వరలో..
ఇక బాలీవుడ్ కి ఇటీవల కాలంలో చెప్పుకోదగ్గ హిట్స్ అసలు లేవు. అంతేకాక సౌత్ లో హిట్ అయిన సినిమాలని తీసుకెళ్లి అక్కడ రీమేక్ చేసుకుంటున్నారు. సౌత్ డైరెక్టర్స్ కి సినిమాలు ఆఫర్ చేస్తున్నారు. బాలీవుడ్ నిర్మాతలు కూడా సౌత్ లోనే పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇలా మొత్తానికి బాలీవుడ్ సౌత్ సినిమాల సక్సెస్ పై కుళ్ళుకుంటుంది. బయటకి చెప్పకపోయినా చాలా మంది బాలీవుడ్ స్టార్లు సౌత్ సినిమాల సక్సెస్ ని తట్టుకోలేకపోతున్నారు. తాజాగా దీనికి పుండు మీద కారం చల్లినట్టు ఆర్జీవీ ట్వీట్స్ చేస్తున్నారు.
RRR : ‘ఆర్ఆర్ఆర్’లో చరణ్ డామినేషన్ పై రాజమౌళి వ్యాఖ్యలు
ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమా అప్పుడు కూడా బాలీవుడ్ ని తక్కువ చేస్తూ తెలుగు సినిమాని పొగుడుతూ ట్వీట్స్ చేశారు వర్మ. తాజాగా కేజిఎఫ్ 2 బాలీవుడ్ లో మొదటి రోజు భారీ కలెక్షన్లు సాధించడంతో మరోసారి వర్మ ట్వీట్ చేశారు. బాలీవుడ్ లో మొదటి రోజు ఎక్కువ కలెక్షన్లు సాధించిన టాప్ 10 సినిమాల లిస్ట్ ని పోస్ట్ చేసి.. ”కన్నడ డబ్బింగ్ సినిమా కెజిఎఫ్ 2, తెలుగు డబ్బింగ్ సినిమా బాహుబలి 2 హిందీ బాక్సాఫీస్ హిస్టరీలో టాప్ ఓపెనర్స్ గా ఉన్నాయి. బాలీవుడ్ సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్లు సాధించాయి. దీనిపై బాలీవుడ్ అని చెప్పుకునే హిందీ పరిశ్రమ స్పందన ఏంటో” అంటూ సెటేరికల్ గా ట్వీట్ చేశారు. ఈ సెటేరికల్ ట్వీట్ బాలీవుడ్ వర్గాలను మరింత అసహనంలోకి నెట్టేయడం ఖాయం. రోజు రోజుకి నార్త్ సినిమాలపై సౌత్ ఆధిపత్యం పెరుగుతుండటంతో బాలీవుడ్ వాళ్లకు ఏం చేయాలో తెలియట్లేదు.
What do you think the Hindi film industry (aka Bollywood) will be thinking about how a Kannada dubbed film #KGF2 and a Telugu dubbed film #Bahubali2 are the biggest ever openers in the history of Hindi cinema ?????? pic.twitter.com/ZChVOqOq8z
— Ram Gopal Varma (@RGVzoomin) April 14, 2022