RRR Movie : ఇకపై పివి’ఆర్ఆర్ఆర్’ థియేటర్స్.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్స్ లో పీక్స్

బాహుబలి తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' సినిమాని తెరకెక్కిస్తున్నారు. స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో భారీ మల్టీస్టారర్ ని నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాపై

RRR Movie :  బాహుబలి తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని తెరకెక్కిస్తున్నారు. స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో భారీ మల్టీస్టారర్ ని నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎప్పుడో రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది. అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది ‘ఆర్ఆర్ఆర్’. ఇటీవల 2022 జనవరి 7న ఈ సినిమా రిలీజ్ చేస్తారని ప్రకటించారు. అభిమానులు ఈ డేట్ కి అయినా రిలీజ్ చేస్తారా లేక మళ్ళీ వాయిదా వేస్తారా అని ఆలోచిస్తున్నారు. కానీ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్స్ చూస్తుంటే ఈ జనవరిలో కచ్చితంగా సినిమా రిలీజ్ అవుతుంది అనే అనిపిస్తుంది.

Balayya : బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షోకి గెస్ట్ గా న్యాచురల్ స్టార్

ఈ సినిమా ప్రమోషన్స్ కోసం చిత్ర బృందం సరికొత్తగా ఆలోచిస్తుంది. ఇండియన్ సినిమా మార్కెటింగ్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టిస్తుంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ట్రిపుల్ ఆర్ సినిమా, పివిఆర్ సినిమాస్ తో అసోసియేట్ అయింది. ఇండియాలో అతి పెద్ద మల్టీ ప్లెక్స్ చైన్ సిస్టం కలిగిన పివిఆర్ సంస్థతో ట్రిపుల్ ఆర్ సినిమా ఫస్ట్ టైం ప్రమోషన్ డీల్ కుదుర్చుకుంది. ఈ డీల్ లో భాగంగా PVR cinemas కి సంబంధించిన అన్ని మల్టీప్లెక్స్ ల పేరు PVRRR గా మారుస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ వరకు PVR సినిమాస్ PVRRR గా కనపడనున్నాయి. ముంబై అంధేరిలోని PVR సినిమాస్ ని PVRRR గా మార్చిన వీడియో ట్విట్టర్ లో షేర్ చేశారు చిత్రబృందం.

Agent Movie : అఖిల్ కోసం స్టైలిష్ విలన్ గా మలయాళం సూపర్ స్టార్.. ‘ఏజెంట్’ విలన్ స్టైలిష్ లుక్ లీక్..

ఇక్కడితో ఆగకుండా ఇంకా భారీగా ప్రమోషన్స్ చేయబోతున్నట్టు సమాచారం. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో మరోసారి పాన్ ఇండియా వైడ్ తన సత్తా చాటడానికి సిద్దమయ్యాడు రాజమౌళి. అభిమానులతో పాటు ప్రేక్షకులు జనవరి 7 కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఎన్ని రికార్డ్స్ ని సృష్టిస్తుందో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు