Balayya : బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షోకి గెస్ట్ గా న్యాచురల్ స్టార్

తెలుగు ఓటిటి ఆహాలో 'అన్‌స్టాప‌బుల్ విత్ NBK' అనే టాక్ షోతో యాంకర్ గా మారబోతున్నారు. ఇటీవలే ఈ షోని గ్రాండ్ గా లాంచ్ చేశారు. దీపావళి కానుకగా ఈ షో టెలికాస్ట్ ప్రారంభం అవ్వనుంది.

Balayya :  ఇన్నాళ్లు వెండితెరపై తన నటన, డైలాగ్స్ తో అన్ని జోనర్స్ లో సినిమాలు తీసి మెప్పించారు నటసింహం నందమూరి బాల‌కృష్ణ. ఇన్నాళ్లు నటనతో అదరగొట్టిన బాలయ్య బాబు ఇప్పుడు హోస్ట్ గా మారి యాంకరింగ్ తో అలరించబోతున్నారు. తెలుగు ఓటిటి ఆహాలో ‘అన్‌స్టాప‌బుల్ విత్ NBK’ అనే టాక్ షోతో యాంకర్ గా మారబోతున్నారు. ఇటీవలే ఈ షోని గ్రాండ్ గా లాంచ్ చేశారు. దీపావళి కానుకగా ఈ షో టెలికాస్ట్ ప్రారంభం అవ్వనుంది.

Agent Movie : అఖిల్ కోసం స్టైలిష్ విలన్ గా మలయాళం సూపర్ స్టార్.. ‘ఏజెంట్’ విలన్ స్టైలిష్ లుక్ లీక్..

ఈ షోలో సినీ ప్రముఖుల్ని బాలకృష్ణ ఇంటర్వ్యూ చేస్తూ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయనున్నారు. సెలెబ్రిటీల నుంచి ఇప్ప‌టి వ‌రకు ఎవ‌రికి తెలియ‌ని విష‌యాల‌ను ఈ షో ద్వారా బ‌య‌ట‌కు తీసుకొస్తాను అని బాలయ్య ఈవెంట్ లో అన్నారు. ఇటీవల ఈ షో షూటింగ్ లో బాలకృష్ణతో మోహన్‌బాబు దిగిన ఫొటో వైరల్‌గా మారింది. ‘అన్‌స్టాప‌బుల్ విత్ NBK’ షోకి ఫస్ట్ గెస్ట్ మోహన్ బాబు అని సమాచారం.

Allu Arjun-Trivikram : త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ నాలుగోసారి.. ‘అల వైకుంఠపురంలో’ సీక్వెల్??

ఆ తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు, రామ్ చరణ్ కూడా ఈ షోకి రాబోతున్నట్టు తెలుస్తుంది. తాజగా నిన్న ఈ షో షూటింగ్ జరిగింది. నిన్న న్యాచురల్ స్టార్ నాని ఈ షోకి గెస్ట్ గా వచ్చినట్టు సమాచారం. నాని ‘కృష్ణ గాడి వీర ప్రేమ కథ’ సినిమాలో బాలకృష్ణకి వీరాభిమానిగా కనిపిస్తాడు. ఆ సినిమాలో చేతిమీద జై బాలయ్య అని పచ్చబొట్టు కూడా వేయించినట్టు చూపిస్తారు. మరి ఒక అభిమానిని అభిమాన హీరో ఇంటర్వ్యూ చేస్తే ఎంటర్టైన్మెంట్ మాములుగా ఉండదు. అభిమానులకి పండగే. బాలయ్య అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఈ షో గురించి ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Shanmukh Jaswanth : షణ్ముఖ్ కి ముద్దు పెట్టిన సిరి.. నా పని అయిపోయింది అన్న షన్ను

ఈ షో మొత్తం 10 ఎపిసోడ్స్ గా చిత్రీకరిస్తున్నారు. సీజన్ 1లో 10 ఎపిసోడ్స్ చేసి మళ్ళీ గ్యాప్ ఇచ్చి వీటికి వచ్చిన ఆదరణ బట్టి సీజన్ 2ని ప్లాన్ చేస్తారని సమాచారం.

ట్రెండింగ్ వార్తలు