Pushpa 2 Update : వామ్మో.. పుష్ప 2 షూటింగ్ ఇంకా అంత బ్యాలెన్స్ ఉందా..? ఎప్పటికి అవ్వుద్ది?

గత కొన్ని రోజులుగా పుష్ప 2 సినిమా వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి.

Pushpa 2 Update : అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప 2 సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కి పాన్ ఇండియా స్టార్ డమ్ రావడంతో పుష్ప 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే గ్లింప్స్ రెండు పాటలు రిలీజ్ చేసి మరింత హైప్ పెంచారు. పుష్ప 2 సినిమాని ఆగస్టు 15న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ గత కొన్ని రోజులుగా ఈ సినిమా వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి.

పుష్ప 2 సినిమా షూటింగ్ శరవేగంగా చేస్తున్నారు. అయినా ఇంకా 50 రోజుల షూటింగ్ మిగిలి ఉందని టాలీవుడ్ సమాచారం. దీంతో చెప్పిన టైంకి సినిమా తీసుకురావడానికి మూవీ యూనిట్ తెగ కష్టపడుతుంది. ఇప్పటికే సుకుమార్ అతని టీమ్ మూడు యూనిట్లుగా సినిమా షూట్ చేస్తున్నారంట. రెండు యూనిట్లు రామోజీ ఫిలిం సిటీలో, ఒక యూనిట్ మారేడుమిల్లిలో షూటింగ్ చేస్తున్నారని సమాచారం.

Also Read : Nikhil Siddhartha : చీరాల ప్రజల కోసం పనిచేస్తున్న నిఖిల్.. సమస్య చెప్పగానే ఆ ఎమ్మెల్యే తరపున తీరుస్తున్న హీరో..

దీంతో 50 రోజుల షూటింగ్ ఎప్పటికి అవ్వుద్ది? దానికి సంబంధించిన CG, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఎప్పటికి పూర్తవుతాయి అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రిలీజ్ డేట్ కి ఇంకా రెండు నెలల సమయమే ఉంది, ఈ లోపు పుష్ప 2 పూర్తవుద్దా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు రామ్ డబల్ ఇస్మార్ట్ సినిమా సడెన్ గా ఇదే డేట్ కి రిలీజ్ చేస్తామని ప్రకటించడంతో పుష్ప 2 సినిమా వాయిదా పడుతుంది కాబట్టే ఆ సినిమా వచ్చిందని ఇండస్ట్రీ జనాలు ఫిక్స్ అయిపోయారు. మరి పుష్ప 2 సినిమా ఎప్పుడు షూటింగ్ అవుతుందో, ఎప్పుడొస్తుందో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు