Sai Sushanth Reddy : మొన్నే సినిమా రీ రిలీజ్.. ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్న ‘ఈ నగరానికి ఏమైంది’ నటుడు..

తాజాగా సాయి సుశాంత్ నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇటీవలే ఈ నగరికి ఏమైంది రీ రిలీజ్ అయిన సంతోషంలో ఉన్నాడు సాయి సుశాంత్. అదే సంతోషాన్ని కొనసాగిస్తూ తాను ప్రేమించిన అమ్మాయిని నిశ్చితార్థం చేసుకున్నాడు.

Ee Nagaraniki Emaindi Actor Sai Sushanth Reddy engaged

Sai Sushanth Reddy :  నటుడు సాయి సుశాంత్ రెడ్డి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రలు వేస్తూ ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో లీడ్ లో కనిపించి అందర్నీ మెప్పించాడు. ఈ నగరానికి ఏమైంది సినిమాలో సాయి సుశాంత్ చేసిన పాత్ర యూత్ కి బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమా పెద్ద విజయం సాధించడంతో అప్పట్నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, సెకండ్ లీడ్ లో పలు సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

ఇటీవలే ఈ నగరానికి ఏమైంది సినిమా రిలీజ్ అయి 5 సంవత్సరాలు కావడంతో జూన్ 29న రీ రిలీజ్ చేశారు. రీ రిలీజ్ లో కూడా ఈ సినిమా పెద్ద హిట్ అయి మొదటిసారి కంటే కూడా ఎక్కువ కలెక్షన్స్ సాధించింది. తాజాగా సాయి సుశాంత్ నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇటీవలే ఈ నగరికి ఏమైంది రీ రిలీజ్ అయిన సంతోషంలో ఉన్నాడు సాయి సుశాంత్. అదే సంతోషాన్ని కొనసాగిస్తూ తాను ప్రేమించిన అమ్మాయిని నిశ్చితార్థం చేసుకున్నాడు.

Krithi Shetty : కృతి శెట్టి వరుస ఫోటోషూట్స్.. ఆరు వారాల్లో ఏకంగా 14 ఫోటోషూట్స్.. ఎందుకు ఇంత హడావిడి?

తనకి కాబోయే భార్యకి రింగ్ తొడుగుతున్న ఫొటోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. అయితే ఆ అమ్మాయి ఎవరు అనేది వివరాలు ప్రకటించలేదు. ఇక ఈ నగరానికి ఏమైంది సినిమా అభిమానులు అతని పోస్ట్ కింద సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ సినిమాలో కూడా సాయి సుశాంత్ క్యారెక్టర్ కి నిశ్చితార్థం సీన్ ఉంటుంది. ఆ సీన్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది. దీంతో దానిని, రియల్ ఎంగేజ్మెంట్ ని కంపేర్ చేస్తూ పలువురు నెటిజన్లు సరదా కామెంట్స్ పోస్ట్ చేస్తూ కంగ్రాట్స్ చెప్తున్నారు కొత్త జంటకు.

ట్రెండింగ్ వార్తలు