Samantha Vijaya Devarakonda Kushi Movie shooting completed video released by unit
Samantha : విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖుషీ’. లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన ఓ పాట అందర్నీ మెప్పించి యూట్యూబ్ లో రికార్డులు సెట్ చేస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుండగా మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా కశ్మీర్, రామోజీ ఫిలిం సిటీ, కేరళలో షూటింగ్ చేశారు. తాజాగా ఈ సినిమాని కాకినాడ, ద్రాక్షారామం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. ఇది ఖుషి సినిమా చివరి షెడ్యూల్ కాగా దీంతో షూటింగ్ మొత్తం పూర్తయింది. చిత్రయూనిట్ స్వయంగా సినిమా చివరి రోజు షూటింగ్ స్పాట్ నుంచి ఓ చిన్న వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో గుడిలో కుటుంబసభ్యులంతా యాగం చేస్తున్నట్టు చూపించారు. సమంత రెడ్ కలర్ చీర కట్టుకోగా విజయ్ షర్ట్, పంచ కట్టుకున్నాడు. ఇలా సాంప్రదాయ దుస్తుల్లో వీరిద్దరూ నమస్కారం పెట్టారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
Samantha : సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత.. షాక్లో అభిమానులు, ఇండస్ట్రీ..
ఇక షూట్ కి సంబంధించిన ఫోటోలు కూడా కొన్ని లీక్ అయ్యాయి. ఇవి ట్విట్టర్ లో వైరల్ గా మారాయి. షూటింగ్ అయిపోవడంతో ఖుషి సినిమా పోస్టు ప్రొడక్షన్ వర్క్ మొదలవ్వనుంది. సెప్టెంబర్ 1న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఫ్యామిలీ, లవ్ ఎంటర్టైనర్ తో విజయ్, సమంత మెప్పిస్తారని సమాచారం. ఇక ఖుషి సినిమా షూటింగ్ కూడా పూర్తవ్వడంతో సమంత ఒక సంవత్సరం పాటు సినిమాలకు బ్రేక్ ఇస్తున్నాను అని ప్రకటించింది. ఆరోగ్యంపై మరింత ఫోకస్ చేసేందుకే ఈ బ్రేక్ అని సమాచారం.
Quick Namasthe from me and Samantha to you all:)
We are just at work wrapping our last schedule now.
Full love,
Your man
Vijay Deverakonda pic.twitter.com/IqoA22ZMNW— Anonymous (@__GirDhar) July 4, 2023