Sankranti 2021 : సంక్రాంతి రద్దీ..జనవరి రెండో వారం వరకు స్పెషల్ రైళ్లు ఫుల్

జనవరి మొదటి వారంలో అప్పటి పరిస్థితి బట్టి సంక్రాంతి రైళ్లపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ దృష్ట్యా రైళ్లలో కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయని...

Sankranti Special Trains : ప్రతీ సంక్రాంతికి నగరం ఊరెళ్లిపోతుంది. ఈ ఏడాదీ సంక్రాంతి పండుగ రానే వస్తుంది. కొద్ది రోజుల్లో ఊరెళ్లే ప్రయాణికులకు ఆర్టీసీ, రైల్వే శాఖలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. తెలుగు వారికి అతిపెద్ద పండుగ ఇది. దీంతో ఈ పండుగను సొంతూళ్లలో జరుపుకోవాలని అనుకుంటుంటారు. అయితే..వారికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా రైళ్లలో, బస్సుల్లో విపరీతమైన రద్దీ నెలకొంటుంది. ముందస్తు రిజర్వేషన్లతో సీట్లు ఫుల్ అయిపోతుంటాయి.

Read More : Vijayawada : వైద్య పరికరాల చీటింగ్ కేసు-విజయవాడలో రూ.23 లక్షల మోసం

సంక్రాంతి సీజన్ లో హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖ వైపుకు వెళ్లే రైళ్లకు, బస్సులకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ట్రైన్ లో అయితే..కనీసం కాలు పెట్టే పరిస్థితి కూడా ఉండదు. ఈ క్రమంలో..దక్షిణ మధ్య రైల్వే శాఖ స్పెషల్ రైళ్లను ఏర్పాటు చేస్తుంటుంది. అలాగే ఈ సంవత్సరం కూడా చేసింది. అయితే…జనవరి రెండో వారం వరకు స్పెషల్ రైళ్లు ఫుల్ అయిపోయాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ వో రాకేశ్ వెల్లడించడంతో ప్రయాణీకులు నిరుత్సాహానికి గురవుతున్నారు. 10tvతో ఆయన మాట్లాడుతూ…

Read More : Somu Veerraju : బీజేపీ అధికారంలోకి వస్తే రూ.75లకే చీప్ లిక్కర్ : సోము వీర్రాజు

జనవరి మొదటి వారంలో అప్పటి పరిస్థితి బట్టి సంక్రాంతి రైళ్లపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ దృష్ట్యా రైళ్లలో కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయనే విషయాన్ని గుర్తు చేశారు. ఓమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నిబంధనలు పక్కాగా అమలు చేస్తున్నట్లు, మార్కుతో పాటు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి నెగిటివ్ రిపోర్ట్ ఉంటేనే రైళ్లలో ప్రయాణించేలా నిబంధన ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాలను బట్టి రానున్న రోజుల్లో నిబంధనలు కఠినతరం చేస్తామని చెప్పారు. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వేలోని అన్ని స్టేషన్లలో నిబంధనలతో పాటు, స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ప్రస్తుతం శబరిమలతో పాటు, ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీ పెరిగిందన్నారు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ వో రాకేశ్ తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు