Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం వచ్చేస్తుంది. మహేష్-కీర్తి సురేష్ జంటగా యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ సర్కారు వారి పాట చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ పరుశురామ్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని సమ్మర్ కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తుండగా.. ప్రేక్షకులలో హైప్ పెంచే పనిలో పడింది యూనిట్.
AAGMC: కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బాగుందే.. ఫీల్ సాంగ్ రిలీజ్!
ప్రేమికుల దినోత్సవం నుంచి ఈ మూవీ మ్యూజిక్ ప్రమోషన్స్ ప్రారంభించబోతోన్నామని చిత్రయూనిట్ ప్రకటించింది.సర్కారు వారి పాట నుంచి రాబోతోన్న ఈ ఫస్ట్ సింగిల్.. మెలోడీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలవబోతోందని ఇప్పటికే థమన్ ప్రకటించేశాడు. ఈ పాటను ఫిబ్రవరి 14న విడదల చేయబోతోన్నట్టు చెప్పేయగా.. ఈ పాట మహేష్ బాబు, కీర్తి సురేష్‌ల మీద రొమాంటిక్‌గా చిత్రీకరించారు.
Pooja Hegde: ఐదు సినిమాలు రిలీజ్.. ఈ ఇయర్ తనదే అంటున్న బుట్టబొమ్మ!
ఇప్పటికీ ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ మహేశ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకోగా ఫస్ట్ సింగల్ కోసం మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్లే మేకర్స్ ఆ పాట ఎలా ఉంబోతుందో శాంపిల్ చూడండి అంటూ బుధవారం ఓ పోస్టర్ వదిలింది. ఇందులో మహేష్ కీర్తి భుజంపై వాలిపోతూ రొమాంటిక్ గా డిజైన్ చేశారు. ఈ కళావతి సాంగ్ కి ఈ పోస్టర్ మరింత హైప్ తెచ్చింది. ఈ పోస్టర్ లో మహేష్ లుక్స్ అల్ట్రా స్టైలిష్ గా ఉంటే కీర్తి సురేష్ మరింత గ్లామర్ గా కనిపిస్తుంది.
The Classical Melody #Kalaavathi will strum your heart strings ♥️ #SVPFirstSingle will join your playlists on FEB 14 ?#SarkaruVaariPaata#SVPOnMay12
Super ? @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @MythriOfficial @GMBents @14ReelsPlus @saregamasouth pic.twitter.com/CtyfZaQXdg
— SarkaruVaariPaata (@SVPTheFilm) February 9, 2022