Schools Reopen: పలు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో తెరుచుకున్న పాఠశాలలు, విద్యార్థులేరి?

నిబంధనల మేరకు ప్రత్యక్ష తరగతులు ప్రారంభం అయ్యాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, చండీగఢ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, మేఘాలయ రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో విద్యాసంస్థలు తెరుచుకున్నాయి

Schools Reopen: దేశంలో కరోనా కేసులు తగ్గుతున్న తరుణంలో కరోనా ఆంక్షలు సడలిస్తూ కేంద్ర వైద్యారోగ్యశాఖ పలు సూచనలు చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో వివాద రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలు ఎత్తివేయడంతో పాటు, కార్యాలయాలు, విద్యాసంస్థలు తెరవాలంటూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సూచనలు జారీచేశాయి. కరోనా ఆంక్షలు సడలించినప్పటికీ విద్యార్థుల ఆరోగ్యభద్రత దృష్ట్యా కేంద్ర వైద్యారోగ్య నిబంధనలు పాటిస్తూ..పాఠశాలలో ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలని పలు రాష్ట్రాలు తమ విద్యాశాఖను ఆదేశించాయి. దీంతో సోమవారం నుంచి పూర్తి స్థాయిలో విద్యాసంస్థలు తెరుచుకున్నాయి.

Also read: Pulwama Attack: పుల్వామా ఉగ్ర దాడికి మూడేళ్లు: ప్రధాని మోదీ నివాళి

నిబంధనల మేరకు ప్రత్యక్ష తరగతులు ప్రారంభం అయ్యాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, చండీగఢ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, మేఘాలయ రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. ఒకటి నుంచి 12వ తరగతి వరకు ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో తరగతులు ప్రారంభించి, ఆరోగ్యశాఖ నిబంధనల మేరకు ఏర్పాట్లు చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాశాఖకు సూచించాయి. తరగతి గదులతో హాస్టల్స్ ను కూడా తెరవాలని సూచించారు.

Also read: Yogi Adityanath: రాహుల్, ప్రియాంక వల్లే కాంగ్రెస్ నాశనం అవుతుంది: యోగి ఆదిత్యనాథ్

హాస్టల్స్ గదుల్లో పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాల విద్యాశాఖ అధికారులు సిబ్బందిని ఆదేశించారు. ఇదిలావుంటే.. సోమవారం నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైనప్పటికీ.. పలు ప్రాంతాల్లో విద్యార్థులు లేక తరగతి గదులు బోసిపోయాయి. కరోనా ప్రభావం ఇంకా కొనసాగుతున్నందున తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రత్యక్ష తరగతులకు పంపించేందుకు సంకోచిస్తున్నారు.

Also read: New Zealand: ఆందోళనకారులు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు: న్యూజీలాండ్ ప్రధాని

ట్రెండింగ్ వార్తలు