Cultivate Paddy : వెదజల్లే పద్ధతిలో వరిసాగు చేయాలంటున్న శాస్త్రవేత్తలు

మొలకెత్తిన విత్తనాలను డ్రమ్ సీడర్ లేదా నేరుగా వెదజల్లే పద్ధతిలో సాగుచేయాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ పద్ధతిలో ఎకరాకి  15 నుండి 20 కిలోల విత్తనం ఆదా అవుతుంది.

Kharif paddy

Cultivate Paddy : ఈ ఏడాది రుతుపవనాలు ఆలస్యంగా పలకరించాయి. అయినా సరిపడ వర్షాలు లేవు. అడపాదడప కురుస్తున్న వర్షాలకు అక్కడక్కడ వరినారుమడులు పోసుకున్నారు. అయితే వరిసాగు సమయం దగ్గర పడుతుండటం.. మరోవైపు నారుమడులు పోయలేకపోయిన రైతులు నేరుగా వెదజల్లే పద్ధతిలో వరిసాగు చేసుకోవాలని రైతులకు శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. నేరుగా వెదజల్లే పద్దతికాని, డ్రమ్ సీడర్ తో కాని వరి సాగుచేస్తే.. కూలీల సమస్యను అధిగమించడమే కాకుండా తక్కువ పెట్టుబడితో 10 రోజుల ముందుగానే పంట చేతికి వస్తుందని చెబుతున్నారు.

READ ALSO : Vegetable Cultivation : కూరగాయ నారుమడిలో తెగుళ్ల ఉధృతి.. నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు

ఖరీఫ్ ప్రారంభమై రెండు నెలలు కావస్తోంది. చాలా వరకు పంటలు విత్తారు.ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల..  రైతులు నాట్లు కూడా వేశారు. అయితే ఇటీవల కాలంలో అకాలంగా కురిసిన భారీ వర్షాలు, వరదలకు చాలా చోట్ల వరిపంటలు దెబ్బతిన్నాయి. వరినారు మడులు కోట్టుకుపోయాయి.  ఇప్పుడు దీర్ఘకాలిక వరి రకాల నార్లమడులు పోసుకునే సమయం దాటి పోయింది. మధ్య , స్వల్పకాలిక రకాలను ఈ నెల చివరి వరకు  పోసుకోవచ్చు.

READ ALSO : Rice Cultivation : పొడి విధానంలో వరి సాగు.. తక్కువ పెట్టుబడితోనే పంట దిగుబడులు

అయితే ఈ విధానంలో సాగు పెట్టుబడులు అధికమవుతాయి. కావడమే కాకుండా, కూలీల సమస్యను అధిగమించేందుకు.. మొలకెత్తిన విత్తనాలను డ్రమ్ సీడర్ లేదా నేరుగా వెదజల్లే పద్ధతిలో సాగుచేయాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ పద్ధతిలో ఎకరాకి  15 నుండి 20 కిలోల విత్తనం ఆదా అవుతుంది. పంట 7 నుండి 10 రోజులు ముందగా కోతకు వస్తుంది. నారు పెంపకం, నారు పీకడం, నాట్లు వేసే పని ఉండదు.

READ ALSO : Eggplant Gardens : వంగలో ఎర్రనల్లి ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

కాబట్టి సాగు ఖర్చు ఎకరానికి రూ. 2500 నుండి 3 వేల వరకు తగ్గుతుంది. అయితే మొక్కల సాంద్రత సరిపడా ఉండటం వలన దిగుబడి 10 నుండి 15 శాతం వరకు పెరుగుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో విత్తుకొవచ్చు. ప్రతి కూల వాతావరణ పరిస్థితులలో పంట కాలం కోల్పోకుండా నీరు అందుబాటులో ఉన్నప్పుడే వరిసాగు చేసుకునే అవకాశముంటుందని తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, డా. ఐ . తిరుపతి.

READ ALSO : Mechanization : వరిసాగులో యాంత్రికరణతో కూలీల కొరతకు చెక్

వెదజల్లే పద్ధతిలో కలుపు యాజమాన్యం తో పాటు ఎరువుల యాజమాన్యం కూగా చాలా కీలకం. అయితే భూముల్లో భాస్వరం  శాతం అధికంగా ఉండటం వలన కేవలం ఆఖరి దుక్కిలో మాత్రమే వేసుకోవాలి. సిఫార్సు చేసిన మేరకే ఎరువులను వాడాలి.

ట్రెండింగ్ వార్తలు