Mizoram : పుస్తకాల బ్యాగు, యూనిఫామ్‌తో స్కూలుకి వెళ్తున్న 78 ఏళ్ల వృద్ధుడు .. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు

చదువుకోవాల్సిన వయసులో చదువుకోలేదు అని కొందరు నిట్టూరుస్తూ ఉంటారు. నిజానికి చదువుకి వయసు అడ్డంకి కాదు. ఈ విషయాన్ని నిరూపించాడు ఓ పెద్దాయన. 78 సంవత్సరాల వయసులో పుస్తకాల బ్యాగు, యూనిఫాంతో స్కూలుకి వెళ్తున్నాడు.

Mizoram

Mizoram : చదువుకోవడానికి వయసుతో సంబంధం లేదు అంటారు. మిజోరాంకి చెందిన 78 సంవత్సరాల వృద్ధుడు 9 వ తరగతిలో చేరి స్కూల్‌కి వెళ్తున్నాడు. అతను ఈ వయసులో ఎందుకు స్కూల్లో జాయిన్ అయ్యాడంటే?

A tear-jerking story : మనవడి చికిత్స కోసం మేకప్ బ్యూటీ బ్లాగర్‌గా మారిన పెద్దాయన.. కన్నీరు తెప్పించే కథ

లాల్రింగ్‌థరా.. మిజోరాంలోని చంపాయ్ జిల్లా హ్రువైకాన్ గ్రామంలో ఉంటాడు. చదువుకి వయస్సు అడ్డంకి కాదని నిరూపించాడు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (RMSA) ఉన్నత పాఠశాలలో 9 వ తరగతిలో చేరాడు. చదుకోవాలనే తన చిరకాల వాంఛను నెరవేర్చుకోవడానికి అతను యూనిఫాం ధరించి, పుస్తకాల బ్యాగుతో రోజుకి మూడు కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్తున్నాడు. టెలివిజన్‌లో వచ్చే వార్తలను అర్ధం చేసుకోవడానికి, అప్లికేషన్ రాయడానికి లాల్రింగ్‌థరా చదువుకోవాలని నిర్ణయించుకున్నాడట.

Elderly Man Stunts on Bicycle : సైకిల్‌పై పెద్దాయన ఫీట్లు మామూలుగా లేవుగా.. వారెవ్వా ఏం జోరు..!!

ఇండో-మయన్మార్ సరిహద్దు సమీపంలోని ఖువాంగ్ లెంగ్ గ్రామంలో 1945 లో జన్మించిన లాల్రింగ్‌థరా జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కున్నాడట. తన తండ్రి అకాల మరణంతో 2 వ తరగతి తర్వాత స్కూలుకి వెళ్లలేకపోయాడట. తల్లికి సాయంగా ఝమ్ పొలాల్లో సాయం చేస్తూ కుటుంబాన్ని పోషించడం మొదలుపెట్టాడట. ఇప్పటికి తను విద్యను పూర్తి చేయాలనే కల స్కూల్లో చేరేలా ప్రేరేపించిందట. చదువుపట్ల అతనికి ఉన్న అంకిత భావాన్ని, సంకల్పాన్ని అందరూ అభినందిస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు