Shaakuntalam: టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో ‘శాకుంతలం’ కూడా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు గుణశేఖర్ డైరెక్ట్ చేయగా, స్టార్ బ్యూటీ సమంత ఈ సినిమాలో లీడ్ రోల్లో నటిస్తోంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు శాకుంతలం మూవీపై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. కాగా ఇటీవల ‘మల్లికా.. మల్లికా..’ సింగిల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా, దానికి సూపర్బ్ రెస్పాన్స్ దక్కింది.
Shaakuntalam: శాకుంతలం డిజిటల్ రైట్స్.. భారీ రేటుకు సొంతం చేసుకున్న ప్రైమ్..?
అయితే తాజాగా ఈ సినిమా నుండి రెండో సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ‘రుషివనంలోన’ అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్‌ను తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ పాటను జనవరి 25న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించారు. అయితే ఈ సాంగ్‌ను ఏ టైమ్‌లో రిలీజ్ చేస్తారనే విషయంపై మరో అప్డేట్ ఇవ్వనుంది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తుండటంతో ఈ సినిమా పాటలపై ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది.
Shaakuntalam: అల్లు అర్హపై స్పెషల్ అప్డేట్ ఇచ్చిన శాకుంతలం టీమ్!
ఈ సినిమాలో సమంత శకుంతల పాత్రలో నటిస్తుండగా, దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ హిస్టారికల్ మూవీలో మోహన్ బాబు, అదితి బాలన్, అనన్య నాగళ్ల, ప్రకాశ్ రాజ్, గౌతమి, మధూ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను నీలిమా గుణ ప్రొడ్యూస్ చేస్తుండగా, ఫిబ్రవరి 17న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నారు చిత్ర యూనిట్.
A melody you’d fall in love with!??#Rushivanamlona/#RushimooniyonKa/#Ruhivanadalondu/#RishivanamAagum/#Risivanthane from Jan 25th.#Shaakuntalam @Gunasekhar1 @Samanthaprabhu2 @ActorDevMohan #ManiSharma @neelima_guna @GunaaTeamworks @SVC_official @tipsofficial @tipsmusicsouth pic.twitter.com/V07HokAK5p
— Samantha (@Samanthaprabhu2) January 23, 2023