The Battle Story of Somnath : ఏకంగా 12 భాషల్లో సోమ్‌నాథ్ టెంపుల్ బయోపిక్.. త్వరలోనే షూటింగ్ మొదలు..

శివుడి జ్యోతిర్లింగాలలో ఒకటైన సోమ్‌నాథ్ ఆలయం గురించి సినిమా తీయబోతున్నారు. సోమ్‌నాథ్ టెంపుల్ గురించి సినిమాని ప్రకటిస్తూ ఓ వీడియోని కూడా రిలీజ్ చేశారు.

Somnath Temple Biopic The Battle Story of Somnath announced

The Battle Story of Somnath :  ఇటీవల బయోపిక్స్(Biopic), చరిత్రకు సంబంధించిన సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్(Bollywood) లో ఇలాంటి సినిమాలు వరుసగా అనౌన్స్ చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నుంచి మరో ఆసక్తికర సినిమా వస్తుంది. శివుడి జ్యోతిర్లింగాలలో ఒకటైన సోమ్‌నాథ్ ఆలయం గురించి సినిమా తీయబోతున్నారు.

సోమ్‌నాథ్ టెంపుల్ గురించి సినిమాని ప్రకటిస్తూ ఓ వీడియోని కూడా రిలీజ్ చేశారు. ఈ వీడియోలో.. మొదటి జ్యోతిర్లింగం సోమ్‌నాథ్, సత్యయుగంలో చంద్రుడు ఆరాధించాడు, త్రేతా యుగంలో రావణాసురుడు పూజించాడు, ద్వాపర యుగంలో కృష్ణుడు పూజించాడు. కానీ కలియుగంలో మహ్మద్ గజినీ 1025వ సంవత్సరంలో ఆలయంపై దాడి చేశాడు. ఆ దాడిని ఎంతోమంది సామాన్య భక్తులు ఎదుర్కొని ప్రాణాలు అర్పించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ దేవాలయాన్ని మళ్ళీ పునరుద్ధించారు అంటూ తెలిపారు.

JD Chakravarthy : గులాబీ కథని ప్రొడ్యూస్ చేయమని రాజశేఖర్ గారి దగ్గరికి వెళ్తే.. నన్ను హీరోగా వద్దని..

The Battle Story of Somnath అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాని మనీష్ మిశ్రా నిర్మిస్తుండగా, అనూప్ తపా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాని హిందీ, తెలుగులో బైలింగ్వల్ ప్రాజెక్ట్ గా తెరకెక్కించనున్నారు. ఈ రెండు భాషలతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, గుజరాతి, మరాఠి, బెంగాలీ, అస్సామీ, ఒడియా, పంజాబీ, నేపాలీ భాషల్లో రిలీజ్ చేయనున్నాం అని ప్రకటించారు. దీంతో ఈ సినిమా కోసం శివ భక్తులు, చరిత్రపై ఆసక్తికారులు ఎదురుచూస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు