Tamannaah : ఒక్కరోజు గ్యాప్‌లో రెండు సినిమాలు.. ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్ళు అయినా ఫుల్ ఫామ్‌లో ఉన్న తమన్నా..

మొన్నామధ్య కాస్త డల్ అయిన తమన్నా కెరీర్ ఇప్పుడు ఫుల్ స్పీడ్ మీదుంది. తమన్నా ప్రస్తుతం కెరీర్ లో ఫుల్ బిజీగా ఉంది. సినిమాలు, వెబ్ సిరీస్ లతో బ్యాక్ టూ బ్యాక్ వర్క్ చేస్తోంది.

Tamannaah Bhatia busy with movies releasing 2 movies in one day gap

Tamannaah Bhatia :  తెలుగ, తమిళ్ ,హిందీ.. ఎక్కడ చూసినా తమన్నాయే కనిపిస్తోంది. స్టార్ హీరోయిన్ గా అప్పట్లో సౌత్ మొత్తం సూపర్ బిజీగా ఉన్న తమన్నా మధ్యలో కాస్త డల్ అయినా మళ్లీ పికప్ అవుతోంది. తెలుగు, తమిళ్, హిందీలో వరుసగా ప్రాజెక్ట్స్ చేస్తున్న తమన్నా వచ్చే నెలలో బ్యాక్ టూ బ్యాక్ మూవీ రిలీజ్ లతో రెడీ అవుతోంది. ఇద్దరు స్టార్ హీరోలతో ఒక్కరోజు గ్యాప్ తో ఆడియన్స్ ముందుకొస్తోంది.

మొన్నామధ్య కాస్త డల్ అయిన తమన్నా కెరీర్ ఇప్పుడు ఫుల్ స్పీడ్ మీదుంది. తమన్నా ప్రస్తుతం కెరీర్ లో ఫుల్ బిజీగా ఉంది. సినిమాలు, వెబ్ సిరీస్ లతో బ్యాక్ టూ బ్యాక్ వర్క్ చేస్తోంది. అంతేకాదు అంతే స్పీడ్ గా సినిమాల్ని కూడా రిలీజ్ చేస్తోంది. మొన్నీమధ్యే జీ కర్దా సిరీస్, లస్ట్ స్టోరీస్ లతో హాట్ టాపిక్ అయిన తమన్నా ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ లతో రెడీ అవుతోంది. అవి కూడా ఒక్కరోజు గ్యాప్ తో రిలీజ్ కాబోతున్నాయి. ఒకటి తమిళ్ స్టార్ హీరో రజనీకాంత్ తో అయితే మరొకటి మెగాస్టార్ చిరంజీవితో.

ఆగస్ట్ 10న రజనీకాంత్ తో తమన్నా కలిసి చేసిన జైలర్ రిలీజ్ కి రెడీ అవుతోంది. భారీ స్టార్ కాస్ట్ తో నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న జైలర్ మూవీ నుంచి ఇప్పటికే తమన్నా సాంగ్స్ రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్నాయి. రీల్స్, వీడియోస్ ఇలా ఎక్కడ చూసినా తమన్నా ‘నువ్వుకావాలయ్యా..’ సాంగే వినిపిస్తోంది. అంతేకాదు జైలర్ క్రేజ్ కి తమన్నాకి అజిత్ మూవీలో హీరోయిన్ గా చాన్స్ కూడా వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది.

ఆగస్ట్ 10న జైలర్ రిలీజ్ అవుతుంటే తెలుగు నుంచి ఆగస్ట్ 11న మెగాస్టార్ హీరోగా భోళాశంకర్ రిలీజ్ కాబోతోంది. ఇలా ఒక్కరోజు గ్యాప్ లో స్టార్ హీరోలతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇస్తోంది తమన్నా. మెహర్ రమేశ్, చిరంజీవి కాంబినేషన్లో కీర్తిసురేష్, తమన్నా సినిమాలో మేజర్ రోల్స్ ప్లే చెయ్యబోతున్నారు. ఈ ఇంట్రస్టింగ్ మూవీ లో తమన్నా, చిరంజీవి ఫుల్ లెంగ్త్ పెయిర్ గా కనిపిస్తున్నారు. అటు భోళాశంకర్ మూవీకి సంబందించి కూడా సాంగ్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. లేటెస్ట్ గా రిలీజ్ అయిన సాంగ్ మరోసారి తమన్నాక్రేజ్ ని తెరమీదకి తీసుకొచ్చింది.

Vishwaksen : బేబీ డైరెక్టర్ Vs హీరో విశ్వక్సేన్.. ట్విట్టర్ లో వివాదం.. సాయి రాజేష్ తో చేయనని చెప్పింది విశ్వక్సేనేనా?

ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్ళు అయినా ఇంకా అన్ని భాషల్లో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ సినిమాలు, సిరీస్ లు చేస్తున్న తమన్నాని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫామ్ ఇప్పట్లో ఆగేలా లేదు. తమన్నా చేతిలో ఇప్పుడు కూడా దాదాపు అరడజను ప్రాజెక్టులు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు