Ambedkar statue: అంబేద్కర్ విగ్రహావిష్కరణకు నాకు ఆహ్వానం రాలేదు: గవర్నర్ తమిళిసై

అంబేద్కర్ ఎక్కువగా మహిళా హక్కుల గురించి మాట్లాడారని తమిళిసై చెప్పారు. అటువంటిది ఆయన విగ్రహావిష్కరణ వేళ మహిళా గవర్నర్ కు ఆహ్వానం అందకపోవడం ఆశ్చర్యంగా ఉందని తమిళిసై సౌందర రాజన్ అన్నారు.

Ambedkar statue

Ambedkar statue: హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద శుక్రవారం రాజ్యాంగ రూపశిల్పి భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహ ఆవిష్కరణ జరిగిన విషయంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ స్పందించారు. ట్యాంక్ బండ్ వద్ద జరిగిన అంబేద్కర్ విగ్రహావిష్కరణకు తనకు ఆహ్వానం అందలేదని చెప్పారు. ఒకవేళ తనకు ఆహ్వానం వస్తే వెళ్లేదాన్నని అన్నారు.

అంబేద్కర్ ఎక్కువగా మహిళా హక్కుల గురించి మాట్లాడారని తమిళిసై చెప్పారు. అటువంటిది ఆయన విగ్రహావిష్కరణ వేళ మహిళా గవర్నర్ కు ఆహ్వానం అందకపోవడం ఆశ్చర్యంగా ఉందని తమిళిసై సౌందర రాజన్ అన్నారు. కాగా, ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ మనుమడు, మాజీ ఎంపీ ప్రకాశ్ అంబేద్కర్ కు కూడా ఆహ్వానం అందడంతో ఆయన ఇందులో పాల్గొన్నారు.

ఈ అంబేద్కర్ విగ్రహం దేశంలోని అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం. 11 ఎకరాల 80 సెంట్ల స్థలంలో ఇక్కడ స్మృతివనాన్ని ఏర్పాటు చేశారు. అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి 2016లో శంకుస్థాపన చేశారు. 2020, సెప్టెంబర్ 16న రూ.146.50 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ట్యాంక్ బండ్ వద్ద 50 అడుగుల ఎత్తైన పార్లమెంట్ నమూనా పీఠంపై అంబేద్కర్ విగ్రహం ఉంటుంది.

YV Subbareddy : టీటీడీ కీలక నిర్ణయాలు.. వెల్లడించిన చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

ట్రెండింగ్ వార్తలు