Telangana BJP : జైలులో బండి సంజయ్..బెయిల్ వస్తుందా ? రాదా .

జైలులోనే ఉన్న సంజయ్‌కు.. బెయిల్ వస్తుందా..? రాదా అనే ఉత్కంఠ నెలకొంది. మంగళవారం బండి సంజయ్‌ బెయిల్ పిటిషన్ మరో బెంచ్‌కు మారింది. ఆయన దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌...

Bandi Sanjay Bail Petition : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బెయిల్ పిటిషన్‌పై 2022, జనవరి 05వ తేదీ బుధవారం హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రస్తుతం జైలులోనే ఉన్న సంజయ్‌కు.. బెయిల్ వస్తుందా..? రాదా అనే ఉత్కంఠ నెలకొంది. మంగళవారం బండి సంజయ్‌ బెయిల్ పిటిషన్ మరో బెంచ్‌కు మారింది. ఆయన దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ తమ పరిధిలోకి రాదన్నారు జస్టిస్ లక్ష్మణ్. ఈ కేసును మరో బెంచ్‌కు బదిలీ చేయాలని రిజస్ట్రీకి ఆదేశాలు జారీ చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేల కేసులు విచారించే బెంచ్‌కు బదిలీ చేయాలని కోర్టు ఆదేశించింది.

Read More : Pakistan Artist : మోదీని ఓడించాలన్న పాక్ నటుడు

దీంతో జస్టిస్ ఉజ్జన్ బాయాల్ బెంచ్‌కు సిఫార్స్ చేశారు. ఈ ధర్మాసనం విచారణ జరిపి బెయిల్‌పై నిర్ణయం తీసుకునే అవకాశముంది. మరోవైపు బండి సంజయ్ ప్రివిలేజ్ మోషన్ లేఖకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. తన హక్కులకు భంగం కలిగినట్లు స్పీకర్‌కు లేఖ రాశారు బండి సంజయ్. దీనిపై 48 గంటల్లో నిజ నిర్ధారణ రిపోర్ట్ ఇవ్వాలని కేంద్ర హోంశాఖకు ఆదేశాలిచ్చారు. వీటికి అనుగుణంగా రాష్ట్ర సీఎస్‌, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది సెంట్రల్‌ హోం డిపార్ట్‌మెంట్‌.

Read More : Grain Purchase : తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు

విచారణలో ఎంపీ బండి సంజయ్‌ వాదనలు కూడా పరిగణలోకి తీసుకోవాలంటూ అధికారులకు సూచించారు లోక్‌సభ స్పీకర్‌. శాంతియుతంగా నిరసన చేస్తున్న తనను అక్రమంగానూ, అవమానకరంగానూ అరెస్ట్‌ చేశారని బండి సంజయ్‌ సోమవారం లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు. దీంతో వివరణ కోరారు ఓం బిర్లా.

ట్రెండింగ్ వార్తలు