Telangana Corona Case Report : తెలంగాణలో కొత్తగా 22 కరోనా కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 17వేల 085 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 22 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.(Telangana Corona Case Report)

Telangana Corona Case Report : తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 17వేల 085 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 22 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా హైదరాబాద్ లో 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో మరో 30మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. నేటివరకు రాష్ట్రంలో 7,91,397 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 7,87,034 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.

రాష్ట్రంలో ఇంకా 252 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటివరకు రాష్ట్రంలో కోవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు 16వేల 267 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 30 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.

అటు దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు, మరణాల్లో స్వల్ప హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. తాజాగా కేసులు 36 శాతం మేర పెరగ్గా.. 70కి పైగా మరణాలు నమోదయ్యాయి. మంగళవారం 4.8 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,086 మందికి పాజిటివ్‌గా తేలింది. ముందురోజు కంటే దాదాపు 300 మేర కేసులు పెరిగాయి. పాజిటివిటీ రేటు 0.23 శాతానికి చేరింది. మొత్తం కేసులు 4.30 కోట్లు దాటాయి.

Omicron New Variant XE : ముంబైలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ XE తొలి కేసు నమోదు

గడిచిన 24 గంటల్లో మరో 71 మంది కోవిడ్ తో మరణించారు. అందులో కేరళ వాటానే 66గా ఉంది. మొత్తంగా నేటివరకు దేశంలో 5.21 లక్షల మంది కరోనాతో చనిపోయారు. రోజురోజుకూ యాక్టివ్ కేసులు గణనీయంగా తగ్గుతూ ఊరటనిస్తున్నాయి. తాజాగా ఆ సంఖ్య 11,871 తగ్గింది. మొత్తం కేసుల్లో వాటి వాటా 0.03 శాతానికి చేరగా.. రికవరీ రేటు 98.76 శాతంగా కొనసాగుతోంది. కరోనా వ్యాప్తి కట్టడి కోసం ప్రారంభించిన వ్యాక్సినేషన్ కార్యక్రమంగా కొనసాగుతోంది. నిన్న 15.4 లక్షల మంది టీకా తీసుకోగా.. ఇప్పటివరకూ 185 కోట్లకుపైగా డోసులు పంపిణీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉధృతి తగ్గుతోందని ఊపిరిపీల్చుకునే లోపే.. కొత్తరకం వేరియంట్లు కలవరపెడుతున్నాయి. ఇటీవల బ్రిటన్‌లో వెలుగు చూసిన కొత్తరకం వేరియంట్‌ ‘ఎక్స్‌ఈ’ భారత్‌లోనూ బయటపడింది. తొలికేసు ముంబైలో నమోదైనట్లు బృహన్‌ ముంబయి మునిసిపల్‌ కార్పొరేషన్‌ (BMC) వెల్లడించింది. దీనితో పాటు మరో కప్పా వేరియంట్‌ కూడా నమోదైనట్లు తెలిపింది. అయితే, ఈ కొత్త రకం వెలుగు చూసిన బాధితుల్లో ఇప్పటివరకు తీవ్ర లక్షణాలేవీ లేవని బీఎంసీ తెలిపింది.

China Daily Covid Cases : చైనా, యుకేలో కరోనా కల్లోలం.. రికార్డు స్థాయిలో రోజువారీ కేసులు..!

సాధారణ కొవిడ్‌ పరీక్షల్లో భాగంగా ముంబైకి చెందిన 230 మంది బాధితుల నమూనాలకు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేపట్టారు. వీటిలో 228 మందిలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ నిర్ధారణ కాగా.. ఒకరిలో కప్పా, మరొకరిలో ఎక్స్‌ఈ బయటపడినట్లు బీఎంసీ అధికారులు వెల్లడించారు. మొత్తం 230 మందిలో 21 మంది బాధితులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగా, వీరిలో ఎవరికీ ఆక్సిజన్‌ అవసరం రాలేదన్నారు. ఆస్పత్రిలో చేరిన బాధితుల్లో 12 మంది వ్యాక్సిన్‌ తీసుకోని వారేనని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు