తెలంగాణను బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి కాపాడాలి.. సంజయ్ విజయం ముందే నిర్ణయమైంది : ప్రధాని మోదీ

కాంగ్రెస్ పార్టీ దేశంలోని అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసింది. పదేళ్ల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం అన్ని రంగాలను అభివృద్ధి చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

PM Modi Vemulawada Public Meeting : అవినీతిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటే.. వారిద్దరిని అవినీతి కలుపుతుంది. ఆ రెండు పార్టీల నుంచి తెలంగాణను కాపాడాలని ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఉదయం కరీంనగర్ లోక్ సభ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కి మద్దతుగా వేములవాడలో నిర్వహించిన సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. బండి సంజయ్ విజయం ఖాయమైంది. కాంగ్రెస్ అతికష్టం మీద ఇక్కడ అభ్యర్ధిని బరిలో నిలిపింది. ఇక్కడ బీఆర్ఎస్ అడ్రస్ కూడా కనిపించడం లేదని మోదీ అన్నారు. ఉదయం 10గంటలకే ఇంత పెద్ద సభ నిర్వహించడం నాకు గుజరాత్ లో కూడా సాధ్యం కాదని స్థానిక బీజేపీ నేతలను మోదీ అభినందించారు.

Also Raed : PM Modi : వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు.. కోడె మొక్కులు చెల్లింపు

కాంగ్రెస్ పార్టీ దేశంలోని అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసింది. పదేళ్ల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం అన్ని రంగాలను అభివృద్ధి చేస్తోంది. ప్రపంచంలో భారత్ ఐదో ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని మోదీ అన్నారు. బీజేపీ దేశ ప్రజలే ముఖ్యమని భావించే పార్టీ. ఇప్పటి వరకు మూడు విడతల్లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి పరాభవమే. ఎన్డీయే కూటమి విజయం వైపు దూసుకెళ్తుంది. మిగిలిన నాలుగు విడతల్లోనూ బీజేపీ, ఎన్డీయే కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు సిద్ధమయ్యారని ప్రధాని అన్నారు. అదానీ, అంబానీని ఇన్నాళ్లు విమర్శించిన కాంగ్రెస్ ఇప్పుడు సైలెంట్ అయింది. ఇప్పుడెందుకు కాంగ్రెస్ వారిపై మాట్లాడడం లేదో చెప్పాలి? వారి నుంచి కాంగ్రెస్ ఎంత తీసుకుందని మోదీ ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను ముస్లింలకు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ చేస్తున్న రాజకీయాలు ఓబీసీలకు నష్టం చేస్తున్నాయి. మాదిగలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ అడ్డుపడుతోందని మోదీ విమర్శించారు.

Also Read : ఎక్కడున్నారు? తెర ముందుకురాని విజయశాంతి, బండ్ల గణేశ్‌

కాంగ్రెస్, బీఆర్ఎస్ కు కుటుంబ ప్రయోజనాలే ముఖ్యం. అవినీతే కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు మధ్య అనుబంధం. తెలంగాణను బీఆర్ఎస్ , కాంగ్రెస్ నుంచి కాపాడాలి, అవినీతిలో ఆ రెండు పార్టీలు ఒక్కటేనని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం గురించి ఆరోపణలు చేసింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎందుకు విచారణ జరపడం లేదని మోదీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు తప్ప చర్యలు తీసుకోవడం లేదు. అందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే. ఆర్ఆర్ ట్యాక్స్ అంటే తెలంగాణలో ప్రతి ఒక్కరికీ తెలుసు. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ కలెక్షన్లు ఆర్ఆర్ సినిమా కలెక్షన్లను మించి పోయాయి. ఆర్ఆర్ ట్యాక్స్ వెయ్యి కోట్ల కంటే ఎక్కువగా వసూలు చేశారంటూ మోదీ విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎంఐఎంకు హైదరాబాద్ పార్లమెంట్ ను ధారాదత్తం చేశాయి. ఇవాళ మొదటి సారిగా ఎంఐఎంకు ఆందోళన కలుగుతుంది. బీజేపీ హైదరాబాద్ లో ధీటైన పోటీ ఇవ్వడం వల్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎంఐఎంను కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నాయంటూ మోదీ అన్నారు.

అయోధ్యలో రామమందిరం నిర్మాణం వల్ల మీకు సంతృప్తి కలిగిందా లేదా..? కానీ, కాంగ్రెస్ పార్టీ అసూయ ద్వేషం పెంచే యత్నం చేస్తోంది. అయోధ్యలో రామమందిరాన్ని సంరక్షింకోవడానికి తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీని తుడిచేస్తారా లేదా.. ఈ పార్టీల పాపాలను ఈనెల 13వ తేదీ లెక్కించేందుకు మీకు అవకాశం ఉంది. ఈసారి బండి సంజయ్, గోమాస శ్రీనివాస్, నగేష్ ను గెలిపించి.. మూడు కమలాలను నా వద్దకు పంపించాలని ప్రధాని మోదీ ప్రజలను కోరారు.

 

 

ట్రెండింగ్ వార్తలు