PM Modi : వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు.. కోడె మొక్కులు చెల్లింపు

వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోడె మొక్కులు సమర్పించారు.

PM Modi

PM Modi Visits Vemulawada Rajanna Temple : లోక్ సభ ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కు మద్దతుగా నిర్వహించిన సభలో పాల్గొన్నారు. అంతకుముందు ప్రధాని మోదీ వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. కోడె మొక్కులు సమర్పించారు. ఆలయంలోకి వస్తున్న సమయంలో ప్రధాని మోదీ క్యూలో వేచి ఉన్న భక్తులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఆలయ నిర్వాహకులు, అర్చకులు ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. మోదీకి తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలిచ్చారు.

Also Read : Cm Revanth Reddy : భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

ఆలయంలో పూజలు అనంతరం .. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బండి సంజయ్ కు మద్దతుగా బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు. అనంతరం వరంగల్ బయలుదేరి వెళ్తారు. అక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ కు మద్దతు ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ పాల్గోనున్నారు.